IND vs PAK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (India-Pakistan ) మధ్య మ్యాచ్ జరగనున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. వన్డే వరల్డ్ కప్ 2027 లో (ODI World Cup 2027) భాగంగా టీమిండియా అలాగే పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉంటాయని… ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కూడా జరగనున్నట్లు ఓ పోస్టు వైరల్ గా మారింది.
వన్డే వరల్డ్ కప్ 2027 లో భాగంగా (ODI World Cup 2027) ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India-Pakistan Mega Clash) మధ్య గ్రూప్ స్టేజిలో మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. జోహన్నెస్‌బర్గ్ లోని (Johannesburg
) వాండెరర్స్ (Wanderers ) వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయని తెలుస్తోంది. ద్వైపాక్షిక సిరీస్ లు ఈ రెండు జట్ల మధ్య రద్దయ్యాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో…ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు అయ్యాయి. దీంతో ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచులు జరుగుతున్నాయి. 2009 నుంచి ఇదే పరిస్థితి ఉంది. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా ఈ రెండు జట్లను ఒకే గ్రూప్ లో ఉంచి, మ్యాచ్ లు జరిపేలా ఐసీసీ ప్రణాళికలు చేస్తోందట.
రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరిగితేనే వ్యూయర్షిప్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కోట్లలో డబ్బులు వస్తాయి. అందుకే ఐసీసీ స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. ఈ లెక్కన 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మళ్లీ మ్యాచ్ లు ఉంటాయని అంటున్నారు. అదికూడా జోహన్నెస్‌బర్గ్ లోని (Johannesburg) వాండెరర్స్ (Wanderers ) వేదికగా ఒక మ్యాచ్ కచ్చితంగా నిర్వహించబోతున్నట్లు చర్చ జరుగుతోంది. కానీ తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. షెడ్యూల్ ఫైనల్ అయిన తర్వాత టైమింగ్స్ పైన క్లారిటీ వస్తుంది.
వన్డే వరల్డ్ కప్ 2027 (ODI World Cup 2027) వచ్చే ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా ( South africa), జింబాబ్వే అలాగే నమీబియా దేశాలలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మొత్తం 14 జట్లు ఇందులో తలపడతాయి. 54 మ్యాచులు జరుగుతాయి. ఎక్కువ శాతం దక్షిణాఫ్రికాలోనే ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. 44 మ్యాచ్ లు దక్షిణాఫ్రికా లో జరిగితే… మిగిలినవి జింబాబ్వే అలాగే నమీబియాలో నిర్వహిస్తారు. ఈ 14 జట్టను గ్రూపులుగా డివైడ్ చేయనున్నారు. అతి త్వరలోనే 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ షెడ్యూల్ కూడా రిలీజ్ కానుంది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==