E-Paper
Advertisement

ఐఫోన్ క్రేజ్‌కు బ్రేక్ వేసేలా.. Google Pixel 10పై క్రోమా మైండ్ బ్లోయింగ్ డీల్, ఏకంగా రూ.20,000 ఆదా!

ఐఫోన్ క్రేజ్‌కు బ్రేక్ వేసేలా.. Google Pixel 10పై క్రోమా మైండ్ బ్లోయింగ్ డీల్, ఏకంగా రూ.20,000 ఆదా!
Advertisement

Google Pixel 10 Price Drop: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ క్రోమా, గూగుల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ Pixel 10పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. లాంచ్ సమయంలో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు క్రోమా అందిస్తున్న ప్రత్యేక తగ్గింపులతో ఈ ప్రీమియం ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ధర, బ్యాంక్ ఆఫర్లు:

క్రోమాలో 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ Google Pixel 10 అసలు ధర రూ.79,999 కాగా, ప్రస్తుతం రూ.15,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ.64,999కే లభిస్తోంది. దీనికి తోడు HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.59,999కి తగ్గుతుంది. అలాగే 6 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది. టాటా నియు కార్డ్ వాడేవారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

Advertisement

Also Read: చదివిన వెంటనే సీక్రెట్ మెసేజ్‌లు మాయం.. వాట్సప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్!

డిస్‌ప్లే, ప్రాసెసర్ విశేషాలు:

ఈ ఫోన్ 6.3 ఇంచుల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండటం వల్ల ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. గూగుల్ సరికొత్త ‘టెన్సర్ జీ5’ ప్రాసెసర్‌పై పనిచేసే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది. దీనికి ఏకంగా ఏడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు లభిస్తాయి. అలాగే దీనిలో జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి ఎన్నో అద్భుతమైన ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

కెమెరా విషయానికి వస్తే:

Advertisement

ఫొటోగ్రఫీ పరంగా Pixel 10 అద్భుతంగా ఉంటుంది. దీని వెనుక భాగంలో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 20 రెట్లు జూమ్ చేయగల 10.8MP టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు వైపు 10.5MP కెమెరాను అమర్చారు. దీని ద్వారా 4K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

నీళ్లలో పడినా ఏం కాదు:

ఈ Google Pixel 10లో 4,970mAh సామర్థ్యం గల పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. నీటి నుండి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్, స్క్రీన్ భద్రత కోసం గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆఫర్ అబ్సిడియన్ రంగుతో పాటు ఇండిగో, ఫ్రాస్ట్, లెమన్‌గ్రాస్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Also Read: ఈ ఫోన్‌తో రీల్స్ చేస్తే వ్యూస్ రాకెట్‌లా దూసుకెళ్తాయ్.. 4K ఫ్లాష్ రికార్డింగ్‌తో Honor 600 సంచలనం!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×