BigTV English

Yograj Singh: ఇండియా నుంచి ఆమెను తరిమి కొట్టండి..యోగ్ రాజ్ వార్నింగ్?

Yograj Singh: ఇండియా నుంచి ఆమెను తరిమి కొట్టండి..యోగ్ రాజ్ వార్నింగ్?

 


Yograj Singh: కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ( Shama Mohamed ) వర్సెస్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) మధ్య జరుగుతున్న వివాదంపై… టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ ( Yograj Singh ) స్పందించారు. ఇండియా నుంచి వెంటనే… కెప్టెన్ రోహిత్ శర్మ పై బాడీ షేవింగ్ కామెంట్స్ చేసిన కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ను వెల్లగొట్టడంటూ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం నుంచి… రోహిత్ శర్మ విషయంలో బిజెపి వర్సెస్ కాంగ్రెస్ మధ్య వివాదం కొనసాగుతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పైన బాడీ షేవింగ్ కామెంట్స్ చేసిన కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ .. కారణంగా వివాదం తారస్థాయికి చేరింది.

అయితే దీనిపై యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ స్పందించడం జరిగింది. ఇండియాకు అనేక ట్రోఫీలు తీసుకువచ్చిన వ్యక్తి రోహిత్ శర్మ అని కొనియాడారు. అలా ఇండియాకు గర్వకారణమైన రోహిత్ శర్మ లాంటి వ్యక్తులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే రోహిత్ శర్మకు షామా మహమ్మద్, కాంగ్రెస్ నేతలందరూ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్. రోహిత్ శర్మ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి కొంచమైనా సిగ్గు ఉండాలి అంటూ నిప్పులు తిరిగారు. ఒక్కసారి అతని గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. క్రికెట్ అంటేనే మా మతం. దేశ గౌరవాన్ని అందరికీ తెలిసేలా… మేము క్రికెట్ ఆడతామని తెలిపారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. తానే ప్రధాని అయితే వెంటనే కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ను ఇండియా నుంచి తరిమి వేసే వాడిని అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్. ఈ వివాదం ఇక్కడితో ఆగదని… ఆమెపై దాడులు చేసే ఛాన్సులు కూడా ఉంటాయని హెచ్చరించారు.


ఇది ఇలా ఉండగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పైన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ మహిళ నేత షామా మహమ్మద్. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత బరువైన క్రికెటర్ అంటూ బాంబు పేల్చారు. బరువుగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ అసలు టీమిండియా కు విజయాలు అందిస్తాడా? అతడు ఒక చెత్త ప్లేయర్ అంటూ నిప్పులు చెరిగారు షామా మహమ్మద్. లావుగా ఉన్న రోహిత్ శర్మను కెప్టెన్ ఎలా చేశారని కూడా నిలదీశారు కాంగ్రెస్ నేత షామా మహమ్మద్. సౌరవ్ గంగూలీ అలాగే మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ లాగా కెప్టెన్లు ఉండాలని… ఆమె కోరారు. కానీ రోహిత్ శర్మ మాత్రం బాగా బరువు ఉన్నాడన్నారు. దీంతో షామా మహమ్మద్ ను ఉద్దేశించి… రోహిత్ శర్మ ఫ్యాన్స్, అలాగే బిజెపి ప్రతినిధులు ఆమెను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దారుణమైన బండబూతులతో కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×