E-Paper
Advertisement

T20 World Cup 2026: టీ20 ప్రపంచ క‌ప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్..? సూప‌ర్ 8లోకి టీమిండియా, USA !

T20 World Cup 2026: టీ20 ప్రపంచ క‌ప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్..? సూప‌ర్ 8లోకి టీమిండియా, USA !
Advertisement

T20 World Cup 2026:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అసలు ఇండియా తో మ్యాచ్ ఆడబోమని డ్రామాలు ఆడిన పాకిస్తాన్ , చివరికి నిన్న కొలంబో వేదికగా తలపడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఏకంగా 61 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఇండియా చేతిలో నిన్న ఓడిపోయిన పాకిస్తాన్ కు మరో కొత్త టెన్షన్ మొదలైంది. పాకిస్తాన్ పై గెలిచిన ఇండియా సూపర్ 8లోకి దూసుకు వెళ్లగా, పాకిస్తాన్ మాత్రం పాయింట్లు పట్టికలో దిగజారిపోయింది. పాకిస్తాన్ కు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు గట్టి పోటీ ఇస్తోంది. కాస్త తేడా అయితే పాకిస్తాన్ ఎలిమినేట్ కావడం జరిగే ప్రమాదం కూడా ఉంది.

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్?

Advertisement

కొలంబో ప్రేమ దాస స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ టోర్నమెంట్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న టీమిండియా 6 పాయింట్లు సాధించుకొని సూపర్ 8 లోకి అడుగుపెట్టింది. గ్రూప్ ఏ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే పాకిస్తాన్ జట్లకు సూపర్ 8 చాన్స్ ఉంది. నమిబియా, నెదర్లాండ్ ఇంటికి వెళ్లడం గ్యారంటీ.

అయితే నిన్న ఇండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్, మైనస్ రన్ రేట్లోకి వెళ్ళింది. దీంతో పాయింట్లు పట్టికలో రెండవ స్థానానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దూసుకు వెళ్లింది. పాకిస్తాన్ మూడవ స్థానానికి దిగజారింది. ఇప్పటికే యూఎస్ఏ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. దానికి తోడు ప్లస్ రన్ రేట్ ఉంది. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ వర్సెస్ నమీబియా మధ్య మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇందులో కచ్చితంగా పాకిస్తాన్ గెలవాలి. ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోయి నమీబియా గెలిస్తే, సూపర్ 8 లోకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంట్రీ ఇస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే 6 పాయింట్లు సాధించనుంది. దీంతో యూఎస్ఏ ఇంటికి వెళ్లడం గ్యారంటీ. అటు పాకిస్తాన్ సూపర్ 8లోకి దూసుకు వెళ్తుంది.

నమీబియాతో పాకిస్తాన్ మ్యాచ్

Advertisement

పాయింట్లు పట్టికలో మూడోస్థానంలో ఉన్న పాకిస్తాన్, కచ్చితంగా తన తర్వాతి మ్యాచ్ నమీబియా పైన విజయం సాధించాలి. ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 18వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఉంటుంది. అయితే ఇండియా చేతిలో తేలిపోయిన పాకిస్తాన్, నమీబియా జట్టును ఎదుర్కోవడం కష్టమే అంటున్నారు. నమీబియా ఒకప్పటిలాగా చిన్న జ‌ట్టేం కాదు. పాకిస్తాన్ జట్టును ఓడించే అంత శక్తి నమీబియాకు ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. లేకపోతే అంతర్జాతీయంగా పరువు పోతుంది.

 

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×