E-Paper
Advertisement

Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్
Advertisement

Sara Tendulkar:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) హడావిడిలో టీమిండియా ఉంటే… సచిన్ టెండూల్కర్ ఇంట్లో మాత్రం పెళ్లి సందడి నెలకొంది. వచ్చే నెలలో అర్జున్ టెండూల్కర్ వివాహం ( Arjun Tendulkar wedding ) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. పనులన్నీ చకచకా చేసేస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ) పెళ్లి హడావిడి నేపథ్యంలో సారా టెండూల్కర్ కు ( Sara Tendulkar ) సంబంధించిన షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న సారా టెండూల్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అర్జున్ టెండూల్కర్ పెళ్లి నేప‌థ్యంలో జామ్ న‌గ‌ర్ కు వ‌చ్చిన సారా టెండూల్క‌ర్ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. కారులో కూర్చుని వెక్కివెక్కి ఏడ్చిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్..కార‌ణం ఏంటంటే

Advertisement

సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం వచ్చే నెలలో జరగనుంది. మార్చి 5వ తేదీన అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ( Saaniya Chandhok) వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ వివాహ వేడుక అంబానీ ఎస్టేట్స్‌ లో నిర్వహించనున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే గుజరాత్ లోని జామ్ నగర్ కు సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ వచ్చింది. పెళ్లి పనుల్లో భాగంగా జామ్ నగర్ వచ్చింది సచిన్ ఫ్యామిలీ. ఈ సందర్భంగా అర్జున్ టెండూల్కర్ తల్లి అంజలి, సారా టెండుల్కర్ కూడా సింపుల్ డ్రెస్సు లలో మెరిసారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేసేందుకు గుజరాత్ లోని జామ్ నగర్ కు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సందర్భంగా సారా టెండూల్కర్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె కన్నీళ్లు ఎందుకు పెట్టుకుంటుందని కొంతమంది సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు. ఏడుస్తోన్న సారా టెండూల్క‌ర్‌ ఆంటీ లాగా ఉందని.. కాస్త బొద్దుగా తయారైందని కొంత మంది దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్న సారా టెండూల్కర్ అచ్చం జయలలిత లాగా ఉందని సెటైర్లు కూడా పేల్చుతున్నారు. తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ వివాహం చేస్తున్నారు… గిల్ తో త‌న‌ పెళ్లి కూడా చేయొచ్చు కదా ? అంటూ సారా కన్నీళ్లు పెట్టుకున్నట్లు మరి కొంతమంది ర్యాగింగ్ చేస్తున్నారు. గిల్ తో సచిన్ టెండూల్కర్ పెళ్లికి ఒప్పుకోలేదని.. అందుకే కారులో కూర్చొని సారా టెండూల్కర్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మరి కొంతమంది చుర‌క‌లు అంటిస్తున్నారు. మొత్తానికి సారా టెండూల్కర్ ఎమోషనల్ అయిన వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది.

Advertisement

Also Read: Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

 

 

 

?igsh=MWZrbzBmeHlvcDl2dw==

 

?utm_source=ig_web_copy_link

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×