E-Paper
Advertisement

T20 World Cup : అమ్మాయిలు అదుర్స్ .. U-19 టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం..

T20 World Cup : అమ్మాయిలు అదుర్స్ .. U-19 టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం..
Advertisement

T20 World Cup :మన అమ్మాయిలు అదరగొట్టారు. U-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో దుమ్మురేపారు. ఇంగ్లాండ్ ను ఫైనల్ లో చిత్తుగా ఓడించిన తొలిసారి భారత్ కు అండర్ -19 వరల్డ్ కప్ ట్రోఫిని అందించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్… ఇంగ్లాండ్ బ్యాటర్లను ప్రారంభం నుంచి కట్టడి చేసింది. మన బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు బ్యాట్లు ఎత్తేశారు. సాధు, అర్చనాదేవి, పర్షవి చోప్రా రెండేసి వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. వారికి మన్నత్ క్యాశప్ , షఫాలీ వర్మ, సోనమ్ తలో వికెట్ పడగొట్టి సహకారం అందించారు. దీంతో ఇంగ్లాండ్ 17.1 ఓవర్లలోనే 68 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ర్యానా మెక్ డొనాల్డ్ గే ఒక్కరే 19 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించింది. ఆ జట్టులో ఏడుగురు బ్యాటర్లు 4 పరుగులలోపే చేశారు.

69 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 పరుగులకే ఓపెనర్లు కెప్టెన్ షఫాలీ వర్మ ( 15 పరుగులు), శ్వేతా షెహ్రావత్ ( 5 పరుగులు) వికెట్లు కోల్పోయింది. అయితే వన్ డౌన్ బ్యాటర్ సౌమ్యా తివారీ (3 ఫోర్లతో 24 నాటౌట్) , తెలుగమ్మాయి గొంగడి త్రిష ( 24 పరుగులు)తో కలిసి భారత్ ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసింది. ఈ జోడి 46 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే విజయానికి 3 పరుగుల దూరంలో త్రిష అవుట్ అయ్యింది. కానీ సౌమ్యా తివారీ అజేయంగా నిలిచి భారత్ కు విజయాన్ని అందించింది.

Advertisement

అండర్ -19 అమ్మాయిల విభాగంలో భారత్ తొలిసారిగా వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హన్నాహ్ బాకర్, గ్రేస్, అలెక్సా స్టోన్ హౌస్ తలో వికెట్ పడగొట్టారు. దీంతో మరో 36 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది.

4 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన సాధుకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నిలో 293 పరుగులు చేయడమేకాకుండా 9 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ గ్రేస్ స్క్రీవెన్స్ ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకుంది.

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×