E-Paper
Advertisement

Asteroid Came Closer to Earth: భూమికి దగ్గరగా గ్రహశకలం.. శాస్త్రవేత్తల హెచ్చరిక..

Asteroid Came Closer to Earth: భూమికి దగ్గరగా గ్రహశకలం.. శాస్త్రవేత్తల హెచ్చరిక..
Advertisement
Asteroid Came Closer to Earth

నక్షత్ర మండలంలో ఉండే కొన్ని గ్రహాలు ఎప్పటికీ అలాగే ఉండిపోకుండా ముక్కలుగా అయిపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. అలాంటివి ఒక్కొక్కసారి భూమికి కూడా దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. కానీ అవి భూమిపై పడే అవకాశం ఉన్నప్పుడు శాటిలైట్ల ద్వారా ఆ గ్రహశకలాన్ని దారిమళ్లించే ప్రయత్నం చేస్తారు శాస్త్రవేత్తలు. కానీ ఈసారి వారికే తెలియకుండా ఓ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చింది.

దాదాపు ఏనుగంత పరిణామంలో ఉన్న ఓ గ్రహశకలం మునుపెన్నడూ లేని విధంగా భూమికి చాలా దగ్గరగా వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘2023 బియూ’ అనే పేరుగల ఈ స్పేస్ రాక్ సౌత్ అమెరికాపై నుండి వెళ్లినట్టుగా వారు తెలిపారు. కేవలం భూమికి 2,200 మైళ్లు అంటే 3,540 కిలోమీటర్ల దూరం నుండే అది వెళ్లినట్టు వారి పరిశోధనల్లో తేలింది. భూమికి ఇంత దగ్గరగా ఓ స్పేస్ రాక్ రావడం ఇది నాలుగవసారని శాస్త్రవేత్తలు గుర్తుచేసుకున్నారు.

Advertisement

భూమికి అంత దగ్గరగా వచ్చి వెళ్లినా కూడా అది భూమిపై పడే అవకాశం ఉండేది కాదని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఒకవేళ భూమికి అత్యంత చేరువగా వచ్చినా కూడా అది గాలిలోనే కాలిపోయేదని వారు తెలిపారు. ఆ గ్రహశకలం దాదాపు 11.5 అడుగుల నుండి 28 అడుగుల దూరం ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. అది ఒక మినీబస్ లేదా ఒక ఏనుగు పరిణామంలో ఉంటుందని వారు బయటపెట్టారు. రోబోటిక్ టెలిస్కోప్స్‌లో దాని దృశ్యాలు రికార్డ్ అయ్యాయని శాస్త్రవేత్తలు అన్నారు.

రోబోటిక్ టెలిస్కోప్‌లో 2023 బియూ దాదాపు 37,000 కిలోమీటర్లు ప్రయాణించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఎలీనా రోబోటిక్ యూనిట్ ఈ దృశ్యాలను రికార్డ్ చేయడానికి సహాయపడింది. ఆకాశంలో ఎక్కువగా మబ్బులు ఉన్న కారణంగా దాని దృశ్యాలు రికార్డ్ అవ్వడం కష్టంగా మారిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ ఆకాశం మామూలుగా మారిన తర్వాత వారికి ఆ గ్రహశకలం లైవ్ ఫీడ్ దొరికిందని అన్నారు. భూమికి 22,000 కిలోమీటర్లు దూరంలో ఉన్నప్పుడు వారికి 2023 బియూ దృశ్యాలు స్పష్టంగా కనిపించాయని తెలిపారు.

Advertisement

2023 బియూ ఎన్నో వేలసార్లు భూమిపై నుండి వెళ్లినా.. భూమికి ఇంత దగ్గరగా రావడం మాత్రం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంకా ఇలాంటి స్పేస్ రాక్స్ ఎన్నో భూమి చుట్టూ తిరుగుతున్నాయని, వాటిని కనుగొనే ప్రయత్నంలోనే ఉన్నామని వారు స్పష్టం చేశారు.

New Planet Discovered:కొత్త గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. చేరుకోవడం సాధ్యమేనా..?

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×