E-Paper
Advertisement

Today IPL 2024 Match: గిల్ గెలుస్తాడా..? ధావన్ మెరుస్తాడా..?

Today IPL 2024 Match: గిల్ గెలుస్తాడా..? ధావన్ మెరుస్తాడా..?
Gujarat Titans vs Punjab Kings Match
Gujarat Titans vs Punjab Kings Match

Gujarat Titans Vs Punjab Kings in IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ లు ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్కరు మెరుస్తున్నారు. ఒంటి చేత్తో జట్టుకి విజయాన్ని అందిస్తున్నారు. నేడు శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ వర్సెస్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్ మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో రాత్రి 7.30కి జరగనుంది.

ఇప్పటివరకు గుజరాత్ మూడు మ్యాచ్ లు ఆడి, రెండింట నెగ్గి ఒకటి ఓడి నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే మూడు మ్యాచ్ లు ఆడి రెండు ఓడిపోయింది, ఒకటి గెలిచి 2 పాయింట్లు సాధించింది. చివరికి 7వ స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు జరిగితే గుజరాత్ రెండు గెలిచింది. పంజాబ్ ఒక మ్యాచ్ లో విజయం సాధించింది.

గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే కెప్టెన్ గిల్ తన స్థాయికి తగిన ప్రదర్శన ఇంకా చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడిన మూడు మ్యాచ్ ల్లో కలిపి కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు. 31, 8, 36 ఇలా అతని ప్రదర్శన సాగింది. 2023లో గిల్ మొత్తం 17 మ్యాచ్ ల్లో 890 పరుగులు చేసి, టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ మేనేజ్మెంట్ అతని నుంచి మళ్లీ అటువంటి ప్రదర్శన ఆశిస్తోంది.

Also Read: ఎట్టకేలకు ఫిట్.. అందుబాటులో సూర్యకుమార్, ఏ మ్యాచ్‌కి..!

పంజాబ్ కింగ్స్ నుంచి శిఖర్ ధావన్ ఒంటరిపోరాటం చేస్తున్నాడు. అతనికి సహకరించేవారు కరువు అవుతున్నారు. అక్కడ ఆర్బీసీలో విరాట్ ఒక్కడే ఆడుతున్నట్టు, ఇక్కడ కూడా ధావన్ పైనే భారం పడుతోంది. ఈ మ్యాచ్ లో మరి జట్టునెలా ముందుకు నడిపిస్తాడన్నది చూడాల్సిందే.

వీరు ఆడవచ్చు

గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ.

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్),, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శామ్ కరాన్, శశాంక్ సింగ్, హర్షల్ పటేల్, హర్పీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్.

Tags

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×