BigTV English

Youth Halchal in Ongle: కిక్ ఎక్కేసింది.. పోలీసు వాహనం డ్యామేజ్.. చివరకు ఎలాగంటే..?

Youth Halchal in Ongle: కిక్ ఎక్కేసింది.. పోలీసు వాహనం డ్యామేజ్.. చివరకు ఎలాగంటే..?

A youth damage police vehicle at ongole in prakasam


Youth Damaged Police Vehicle in Ganja Effect: ఏపీ పేరు చెప్పగానే ఈ మధ్యకాలంలో తరచు వినబడేవి డ్రగ్స్, గంజాయి. గడిచిన ఐదేళ్లలో అధికారులు భారీ ఎత్తున సీజ్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కూడా. ఒడిషా-ఏపీ బోర్డర్ నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి చేరుకుంటోంది. ఈ విషయాన్ని అధికారులు పలుమార్లు వెల్లడించారు. అంతేకాదు పట్టుబడిన నిందితులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే గంజాయికి ఏపీ కేపిటల్ అయ్యిందని రాజకీయ నేతలు బలంగా వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ యువకుడు గంజాయి మత్తులో హల్‌చల్ చేశాడు. మంగమూరు రోడ్డుపై హంగామా చేస్తున్న యువకుడ్ని రక్షక్ వాహన పోలీసులు మందలించారు. మత్తులో ఆ యువకుడు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డాడు. అంతేకాదు వాహనం అద్దాన్ని ఇనుపరాడ్‌తో పగలకొట్టాడు. యువకుడి వీరంగం చూసి కాసేపు పోలీసులు సైలెంట్ అయిపోయారు. చివరకు చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకోవడంతో వారి సాయంతో యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.


చెప్పుకోవడానికి ఇది ఒక ఘటన మాత్రమే. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయని అంటున్నారు. ఆ మధ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాల సమీపంలో కొందరు యువకులు గంజాయిని అమ్మిన సందర్భాలు ఉన్నాయి. స్థానికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ తరహా ఘటనలు చూసినవాళ్లు మాత్రం.. గడిచిన ఐదేళ్లలో గంజాయి కంట్రోల్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదికాదంటున్నారు. దీనికంతటికీ పోలీసులే కారణమన్న వాదనలు అక్కడి ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

Also Read: నోట్ల కట్టలు.. బంగారం.. లిక్కర్.. కేవలం 15 రోజులకే..

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×