Kushitha Hardik: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. బుధవారం రోజున సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే మ్యాచ్ అనంతరం… ఇరు జట్ల ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇస్తూ… గ్రౌండ్ను వీడారు. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న హైదరాబాద్ కు చెందిన కొంతమంది అమ్మాయిలతో… ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సెల్ఫీలకు ఫోజులిచ్చాడు. కొంతమందితో ఫోటోలు కూడా దిగాడు. అందమైన అమ్మాయిలు… హార్దిక్ పాండ్యా తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.
టాలీవుడ్ నటితో హార్దిక్ పాండ్యా రిలేషన్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో టాలీవుడ్ నటి కుషిత కల్లపు కూడా ఫోటోలు దిగారు. బుధవారం రోజున జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియానికి ఈ టాలీవుడ్ నటి కృషిత కూడా వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బ్లాక్ డ్రెస్ లో మెరిసిన ఈ బ్యూటీ… హార్దిక్ పాండ్యా తో కలిసి ఫోటోలు కూడా దిగింది. అతని గట్టిగా హాగ్ చేసుకుని మరి…. ఫోటోలు దిగింది ఈ బ్యూటీ. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు చూసిన క్రికెట్ అభిమానులు అలాగే తెలుగు ప్రజలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొత్త అమ్మాయిని హార్థిక్ పాండ్యా పట్టాడ్రో… ఇంకేముంది ఆమెను పెళ్లి చేసుకో అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు అమ్మాయిని హార్దిక్ పాండ్యా పెళ్లి చేసుకోబోతున్నాడని… అందుకే అలా క్లోజ్ గా ఇద్దరు ఫోటోలు దిగారని మరికొంతమంది అంటున్నారు. ఆమె ముఖానికి హార్దిక్ పాండ్యా అవసరమా అంటూ మరికొంతమంది సెటైర్లు కూడా పేల్చుతున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తో కుషిత కల్లపు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నటాషాకు విడాకులు ఇచ్చిన పాండ్యా
గత ఏడాది చివర్లో… తన భార్య నటాషాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచి విడిగా ఉంటున్నారు హార్దిక్ పాండ్యా అలాగే నటాషా. ఇక ఆ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత… పరస్పరంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటికే వాళ్లకు అగస్త్య పాండ్యా అనే కుర్రాడు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ అగస్త్య పాండ్యా… కొన్ని రోజులు తల్లి నటాషా దగ్గర అలాగే మరికొన్ని రోజులు హార్దిక్ పాండ్యా దగ్గర ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే… ఓ బాలీవుడ్ నటిని కూడా హార్దిక్ పాండ్యా ప్రేమిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు మొన్నటి నుంచి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. జాస్మిన్ వాలియా అనే అమ్మాయితో ఈమధ్య హార్దిక్ పాండ్యా తిరుగుతున్నాడు. ఆమె కూడా…. ముంబై ఆడే ప్రతి మ్యాచ్ కు స్టేడియానికి వచ్చి హార్దిక్ పాండ్యాను ఎంకరేజ్ చేస్తోంది.
Hardik pandya with SRH fans girls 🧡💙 pic.twitter.com/tnORDi7W5t
— Nenu (@Nenu_yedavani) April 24, 2025