IPL 2026 Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ 90 శాతం పూర్తయింది. మరో 10 రోజులు గడిస్తే టోర్నమెంట్ కూడా ఫినిష్ కానుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ లోకి (IPL 2026 Playoffs) దూసుకు వెళ్ళింది. మరో మూడు జట్లు క్వాలిఫై కావాల్సి ఉంది. అయితే ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) మధ్య ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ ఉంది. ఇందులో చెన్నై ఓడిపోతే, సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళనున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లలో ఫ్రీగానే చూడవచ్చు. అయితే ఇవాళ జరిగే ఈ మ్యాచ్ మూడు గంటలకు చాలా కీలకంగా మారింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైతే… గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు నేరుగా ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్తాయి. ఇవాళ చెన్నై ఓడిపోతే, హైదరాబాద్ ఖాతాలోకి 16 పాయింట్స్ దక్కుతాయి. అది ఇప్పటికే గుజరాత్ ఖాతాలో 16 పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లు క్వాలిఫై కానున్నాయి.
ఎందుకంటే, 16 పాయింట్స్ సాధించే ఛాన్స్ రాజస్థాన్ రాయల్స్ కు తప్ప మరే జట్టుకు ఆ అవకాశం ఉండదు. అటు ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ కు మరో మ్యాచ్ ఉంటుంది. అందులో కచ్చితంగా గెలిచి.. ఇతర జట్లపై ఆధార పడాల్సి వస్తుంది. అదే ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ పైన చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తే పరిస్థితి వేరే లాగా ఉంటుంది. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే టాప్ 4 లోకి దూసుకు వెళ్తుంది. అప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు టాప్ 2లో స్పాట్ ఫిక్స్ అయి… క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫై అవ్వడానికి కూడా ఛాన్స్ లు పెరుగుతాయి. మరి ఇవాల్టి మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్లే ఆఫ్స్ లోకి వెళ్లింది.
IPL 2026
Qualification Scenarios !
– If SRH Beats CSK Tomorrow, then SRH and GT will Qualify into the Playoffs.
This Means, 3 Teams would have been Qualified and it'll be the Fight for the 4th Spot ! pic.twitter.com/TxlPd6BBDP
— Aswin Dugout 🏏 (@M_Aswin100) May 17, 2026
Best script for ipl 2026 if GT will lose their last match,srh will lose their both match and pbks also lose their last match and CSK will win their last 2 match and CSK will finish 2nd in table 🤭. pic.twitter.com/zysEOwphkG
— Ayush (@AayushPaswan26) May 17, 2026