BigTV English

Krunal Pandya:- కెఎల్ రాహుల్‌ను రీప్లేస్ చేసేది కృనాల్ పాండ్యానే.. 3 రీజన్స్

Krunal Pandya:- కెఎల్ రాహుల్‌ను రీప్లేస్ చేసేది కృనాల్ పాండ్యానే.. 3 రీజన్స్

Krunal Pandya:- కెఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం లక్నో సూపర్ జెయింట్స్‌కు పెద్ద దెబ్బే. ఈ లోటును భర్తీ చేసేందుకు కృనాల్ పాండ్యా వైపే చూస్తోంది లక్నో. కృనాల్ పాండ్యా ఆల్ రౌండర్ ఆటగాడు. 2016లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన కృనాల్.. ఇప్పటి వరకు 107 మ్యాచులు ఆడాడు. బాల్‌తో పాటు బ్యాట్‌తోనూ ఇంపాక్ట్ చూపించగలడు ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఐపీఎల్‌లో 7.3 ఎకానమీతో 67 వికెట్లు తీశాడు. 135 స్ట్రైక్ రేట్, 22 యావరేజ్‌తో 1448 పరుగులు చేశాడు. ఒక గేమ్‌లో 4 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అదే మ్యాచ్‌లో 23 బాల్స్‌లో 34 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అందుకే, కేఎల్ రాహుల్ స్థానంలో కృనాల్ పాండ్యానే బెస్ట్ ఛాయిస్ అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.


ముంబై ఇండియన్స్ 2016 నుంచి 2021 మధ్య ఐపీఎల్ టైటిల్స్ గెలవడంలో కృనాల్ పాండ్యాది కూడా కీ రోల్. 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచింది. 2017లో ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవడానికి ప్రధాన కారణం కృనాల్ పాండ్యా. ఆ మ్యాచ్‌లో 79 పరుగులకే 8 వికెట్లు పడిపోయిన సమయంలో.. కృనాల్ పాండ్యా ఒక్కడే 47 పరుగులు చేశాడు. ఇక బాల్‌తోనూ ఇరగదీయడంతో టైటిల్ ముంబై ఇండియన్స్ గెలిచింది.

కేవలం ఆల్ రౌండర్‌గానే కాదు.. టీమ్‌ను కూడా లీడ్ చేయగలడు కృనాల్ పాండ్యా. టాప్-3 పొజిషన్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు పవర్ ప్లేలోనూ చాలా ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేయగలడు. రాహెల్ స్థానాన్ని భర్తీ చేయడానికి నికోలస్ పూరన్ కూడా ఉన్నప్పటికీ.. విదేశీ ప్లేయర్లపై ఉన్న లిమిటెడ్ ఆప్షన్ల కారణంగా కృనాల్ పాండ్యానే రైట్ ఛాయిస్ అంటున్నారు.


Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×