BigTV English

skin cancer : అతిచిన్న మైక్రో స్కిన్ క్యాన్సర్.. గిన్నీస్ రికార్డ్‌లో పేరు..

skin cancer : అతిచిన్న మైక్రో స్కిన్ క్యాన్సర్.. గిన్నీస్ రికార్డ్‌లో పేరు..

skin cancer : క్యాన్సర్ అనేది శరీరంలోని ఏ భాగంలో అయినా పెరగవచ్చు, అది పెరుగుతూ పెరుగుతూ మనిషి ప్రాణాలను తీసేయవచ్చు. అందుకే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండడం మంచిదని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే వారు చేసిన తాజా పరిశోధనల్లో అతిచిన్న స్కిన్ క్యాన్సర్ అనేది బయటపడింది. ఇంత చిన్న క్యాన్సర్‌ను చూడడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు సైతం ప్రకటించారు.


ఇటీవల పోర్ట్‌ల్యాండ్‌లో ఒక పేషెంట్ మొహంపై 0.65 మిల్లీమీటర్లు అంటే 0.25 ఇంచుల మచ్చ రూపంలో క్యాన్సర్ అనేది ఏర్పడింది. ఇది కనీసం మనిషి కంటికి కనిపించనంత చిన్నగా ఉంది. దానిపై డెర్మటాలజిస్ట్స్‌తో పాటు శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేసి చూడగా.. అది భయంకరమైన స్కిన్ క్యాన్సర్ మెలానోమా అని నిర్ధారణకు వచ్చారు. ఇంత మైక్రో స్కిన్ క్యాన్సనర్‌ను వారు మొదటిసారి చూస్తున్నామని తెలిపారు శాస్త్రవేత్తలు.

ఈ మైక్రో స్కిన్ క్యాన్సర్‌ను కనిపెట్టడం కోసం డెర్మాటోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించారు శాస్త్రవేత్తలు. ఈ పరికరం చర్మానికి ఏ మాత్రం హాని కలిగించకుండా అందులో ఉండే సమస్యను కనిపెడుతుంది. దీంతో స్కిన్‌లోని క్యాన్సర్‌ను కూడా వెంటనే కనిపెట్టేయవచ్చు. ఈ పరికరం ప్రస్తుతం వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా.. ఇంకా మరెన్నో కొత్త పద్ధతులను కనుక్కోవాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరు డిటెక్ట్ చేసిన మైక్రో స్కిన్ క్యాన్సర్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా పేరు దక్కించుకుంది. అతిచిన్న స్కిన్ క్యాన్సర్‌గా ఇది రికార్డ్ అయ్యింది.


క్యాన్సర్ అనేది ఇతర అవయవాలను వ్యాప్తి చెందిన తర్వాత వైద్యుల కంటికి కనిపిస్తుంది. అప్పుడు వారు దానిని అడ్డుకోవడం కోసం చర్యలు తీసుకోవడం మొదలుపెడతారు. కానీ ఈ మైక్రో స్కిన్ క్యాన్సర్ మాత్రం ఇతర అవయవాలకు వ్యాప్తి చెందే అవకాశం లేకముందే వైద్యులు దానిని కనిపెట్టి అరికట్టారు. సరైన టెక్నాలజీ ద్వారా భయంకరమైన స్కిన్ క్యాన్సర్ నుండి ఆ పేషెంట్‌ను కాపాడగలిగామని, అంతే కాకుండా వారు చేసిన ఈ ప్రయోగానికి గిన్నీస్ రికార్డ్ దక్కడం ఆనందంగా ఉందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.

మెలానోమా అనేది అరుదైన స్కిన్ క్యాన్సర్ అయినా కూడా ఈ క్యాన్సర్ వచ్చినవారిలో చాలావరకు మరణిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఏదైనా మొటిమ లేదా మచ్చ వల్ల చర్మంలో మార్పులు కనిపడితే అది మెలానోమా అయ్యే అవకాశం ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలాంటి భయంకరమైన క్యాన్సర్‌ను మైక్రో స్టేజ్‌లో గుర్తించడం అంత సులభమైన విషయం కాదని.. అయినా శాస్త్రవేత్తలు దానిని సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగారని పేషెంట్ కూడా వారికి ధన్యవాదాలు తెలిపారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×