BigTV English

Manu Bhaker’s Father: మను-నీరజ్ మ్యారేజ్ గాసిప్స్.. గాలి తీసేసిన తండ్రి.. అంత మాట అనేసారేంటి?

Manu Bhaker’s Father: మను-నీరజ్ మ్యారేజ్ గాసిప్స్.. గాలి తీసేసిన తండ్రి.. అంత మాట అనేసారేంటి?

Manu Bhaker’s Father: పారిస్ ఒలింపిక్స్ ఏమోగానీ, మనుబాకర్- నీరజ్‌చోప్రా గురించి ఒకటే చర్చ. కెరీర్‌‌లో యువ ఆటగాళ్లు అనుకున్నది సాధించారని, ఒలింపిక్స్ పుణ్యమా అని వీరి మధ్య రిలేషన్‌షిప్ చిగురించిందని అంటున్నారు. రేపోమాపో వీరిద్దరు ఒకటి కావడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు మనుబాకర్ తండ్రి రామ్‌కిషన్ బాకర్.


పారిస్‌ ఒలింపిక్స్‌‌ 2024లో మనుబాకర్ షూటింగ్ విభాగంలో రెండు పతకాలు సొంతం చేసుకుంది. జావెలిన్ త్రోలో నీరజ్‌చోప్రా రజతం దక్కించుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఇద్దరు యువ ఆటగాళ్లు రెండేసి పతకాలు సాధించారు. ఇద్దరూ హర్యానాకు చెందినవారు. మనుబాకర్‌కు 22 ఏళ్లుకాగా, నీరజ్‌కు 24 ఏళ్లు.

మనుబాకర్-నీరజ్‌చోప్రాల ఈడు జోడు కుదిరింది. వయస్సు, పతకాలు ఇద్దరూ సమానంగా సాధించారు. వీరిద్దరూ ఒకటైతే బాగుంటుందనే చర్చ జోరందుకుంది. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల సందర్భంగా భారత్ ఆటగాళ్లు మనుబాకర్-నీరజ్‌చోప్రా క్లోజ్‌గా కలిసి మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


ALSO READ: అబ్బాయికి 24, అమ్మాయికి 22 .. నీరజ్-మను మధ్య.. ఏమిటి కథ?

ఆ వీడియోపై ఎవరికి వారు కథలు అల్లేసుకుని సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు క్రీడాభిమానులు. ఈలోగా మనుబాకర్ తల్లి కూడా నీరజ్‌తో క్లోజ్‌గా మాట్లాడడం, ఆ తర్వాత నీరజ్‌చోప్రాతో ఒట్టు పెట్టించుకోవడం కనిపించింది. దీంతో వీరిద్దరి మ్యారేజ్ గాసిప్స్‌కి మరింత బలం చేకూరింది. సోషల్‌మీడియా, నేషనల్ ఛానెళ్లలో ఈ వ్యవహారంపై చర్చ కూడా పెట్టారు.

పరిస్థితి గమనించిన మనుబాకర్ తండ్రి రామ్‌కిషన్.. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. మను ఇంకా చిన్నపిల్ల అని, ఇంకా పెళ్లి వయసు రాలేదన్నాడు. ఆ విషయం గురించి తాము ఆలోచించలేదన్నాడు. మను తల్లి నీరజ్‌ని కొడుకులా చూసుకుంటుందంటూ మ్యారేజ్ గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.

ఉన్నట్లుండి రామ్‌కిషన్.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటంటూ చర్చించుకోవడం నెటిజన్స్ వంతైంది. ప్రస్తుతానికైతే మ్యారేజ్ గాసిప్స్‌కు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. రేపటి రోజైనా మను తండ్రి మనసు మార్చుకుంటాడేమో చూడాలి.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×