Rumors Swirl After Video Of Neeraj Chopra Talking To Manu Bhaker Goes Viral: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఆరు పతకాలు సాధించింది. అందులో రజతం సాధించిన నీరజ్ చోప్రా, రెండు కాంస్య పతకాలు సాధించిన మనుబాకర్ మధ్య ప్రేమాయణం చిగురిస్తుందా? అనే వార్తలు నెట్టింటిని ఊపేస్తున్నాయి. అసలు ఏమిటి కథ? అని నెటిజన్లు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు.
నిప్పులేనిదే పొగ రాదంటారు. ఇప్పుడీ విషయం ఎలా బయటకు వచ్చిందా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే చూడండి.
పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ చోప్రా ఇద్దరూ మాట్లాడుకున్నారు. వీరి మధ్య సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తనేం మాట్లాడాడన్నది స్పష్టంగా లేకపోయినా, మనుతో నీరజ్ సరదాగా మాట్లాడుతూ కనిపించాడు.
అయితే ఒక సందర్భంలో నీరజ్ ఏదో చెబుతుండగా మను చిన్నగా నవ్వుతూ పదహారణాల భారతీయ సంప్రదాయాల అమ్మాయిలా సిగ్గు పడటంతో నెటిజన్లకు ఉప్పు అందించినట్టయ్యింది. నీరజ్ చెప్పిన మాటలకు మను ఎదురు చెప్పకుండా అలాగే అన్నట్టు తలఊపింది. దీంతో ఇంక డౌటేలేదు. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని చిలవలు, పలవలుగా నెట్టింట్లో అల్లుకుంటూ పోతున్నారు.
వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది రోయ్ అని మనోళ్లు..
‘ఫ్యూచర్ ఇండియన్ అథ్లెట్ కపుల్’,వీరే అని ఒకరు,
‘బెస్ట్ కపుల్’, అని మరొకరు ‘మను సిగ్గుపడుతోంది’ ఇక డౌటే లేదు.. అని ఇంకొకరు ఇలా వరుసగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి ‘వీరిద్దరూ ఇక నుంచి మంచి ఫ్రెండ్స్ కాదు లవర్స్ అంటూ రాసిపారేశారు ‘మెడల్ విన్నర్స్.. కాబోయే బెస్ట్ కపుల్స్ అంటూ ఒకరు, ఈమధ్య కాలంలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్’ అని ఇలా ఎన్నో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.
ఈ మధ్యలో ఒక ట్విస్ట్ జరిగింది. అదే ఫంక్షన్ కి మను బాకర్ తల్లి సుమేధా బాకర్ కూడా వచ్చారు. అయితే నీరజ్ ఏం చేశాడంటే, మనుతో మాట్లాడిన తర్వాత సరాసరి ఆమె వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడారు. సరే, ఏదో మాట్లాడుతుందని అనుకుంటే పర్వాలేదు. కానీ అక్కడ జరిగిన చిన్న సన్నివేశం ఇప్పుడందరినీ ఆకట్టుకుంటోంది. అదేమిటంటే నీరజ్ చోప్రా చేయి తీసుకుని, ఆమె తన తలపై వేసుకున్నారు. అంటే ఒట్టు వేయించుకున్నారన్నమాట.
నీరజ్.. నువ్వు మాట తప్పవద్దు.. మను చేయి వదలొద్దు అన్నట్టుగా ఆ సీన్ చూసి కథలు అల్లేస్తున్నారు. ఇంతకీ ఆ ప్రామిస్ ఏమిటి? అని అప్పుడే నెటిజన్లు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. మరి వీరి ప్రేమ కథ అన్ని అడ్డంకులను దాటి సుఖాంతమవుతుందా? లేదా అనేది చూడాల్సిందే.