E-Paper
Advertisement

Mohsin Naqvi: టీమిండియాతో బాయ్ కాట్ చేసినా, టీ20 ప్ర‌పంచ క‌ప్ పాకిస్తానే గెలుస్తుంది..న‌ఖ్వీ ఓవ‌రాక్ష‌న్‌

Mohsin Naqvi: టీమిండియాతో బాయ్ కాట్ చేసినా, టీ20 ప్ర‌పంచ క‌ప్ పాకిస్తానే గెలుస్తుంది..న‌ఖ్వీ ఓవ‌రాక్ష‌న్‌
Advertisement

Mohsin Naqvi:  టి20 ప్రపంచ కప్ 2026 ( T20 world Cup 2026) టోర్నమెంట్ నేపథ్యంలో మరో కొత్త నాటకానికి పాకిస్తాన్ తెరలేపిన సంగతి తెలిసిందే. టోర్నమెంట్ ఆడతాం కానీ ఇండియాతో జరిగే మ్యాచ్ బాయ్ కాట్‌ చేస్తున్నట్లు పాకిస్తాన్ సర్కార్ అధికారిక ప్రకటన చేసింది. దానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వంతె పాడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ పాకిస్తాన్ గెలుచుకుంటుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియాతో ( team india vs Pakistan) మ్యాచ్ ఆడకపోయిన సరే, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మాత్రం పాకిస్తాన్ దే అంటూ వ్యాఖ్యానించారు మొహ్సిన్ నఖ్వీ. శ్రీలంక వెళ్తున్న పాకిస్తాన్ కచ్చితంగా టైటిల్ గెల్చుకొని వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ind vs Pak Match-fixing: ఇండియాతో ఫిక్సింగ్ ? ఫోన్ లో చాటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిని పాక్ కోచ్ స‌ర్ఫ‌రాజ్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ పాకిస్తానే గెలుస్తుంది..న‌ఖ్వీ ఓవ‌రాక్ష‌న్‌

Advertisement

T20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో ఛాంపియన్ గా పాకిస్తాన్ నిలుస్తుందని సంచలన ప్రకటన చేశారు మొహ్సిన్ న‌ఖ్వీ. ఇండియాతో మ్యాచ్ బాయ్ కాట్ చేసినప్పటికీ తమదే విజయం అంటూ విర్ర వీగుతున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన జరగబోయే ఇండియా మ్యాచ్ బహిష్కరించింది పాకిస్తాన్. ఇలా బహిష్కరిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ కు నష్టం జరుగుతుంది. ఇండియాకు అదనంగా రెండు పాయింట్లు దక్కడమే కాకుండా… సెమీస్ కు కూడా ఇండియా దూసుకు వెళ్తుంది.

అదే రెండు పాయింట్లు పాకిస్తాన్ కు మైనస్ అవుతాయి కాబట్టి… వాళ్లు సెమిస్ కు వెళ్లడం చాలా కష్టమవుతుంది. కానీ, ఇండియా మ్యాచ్ మినహాయిస్తే యునైటెడ్ స్టేట్స్, నమీబియా , నెదర్లాండ్ జట్లతో గ్రూప్ ఏలో భాగంగా పాకిస్తాన్ ఆడుతుంది. కచ్చితంగా ఈ మూడు మ్యాచ్ ల‌లో పాకిస్తాన్ గెలిచే అవకాశాలు ఎక్కువ. ఈ లెక్కన గ్రూప్ ఏ లో టాప్ 2లో నిలుస్తుంది పాకిస్తాన్. ఇదే జరిగితే, మరో స్టేజ్ ఎక్కువ పాకిస్తాన్ సులభంగా వెళుతుంది. ఇదే విషయాన్ని న‌ఖ్వీ చెప్పదలుచుకున్నాడు. అందుకే పాకిస్తాన్ టైటిల్ గెలుస్తుందని అంటున్నాడు.

ఫైనల్స్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎలా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 world Cup 2026)  భాగంగా లీగ్ దశలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరించింది పాకిస్తాన్. అయితే అనూహ్యంగా ఇండియా అలాగే పాకిస్తాన్ ఫైనల్ కి వెళ్తే, పరిస్థితి ఏంటి ? అని ఇప్పుడు చర్చనీయాంశమైంది. అలా మ్యాచ్ జరిగితే, కచ్చితంగా పాకిస్తాన్ ఆడుతుందని అంటున్నారు. అక్కడ కూడా ఆడకపోతే ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ పరువు పోయే ప్రమాదం ఉంది. అక్కడ ఆడి టైటిల్ గెలుస్తామన్న ధీమాతో నఖ్వీ ఉన్నారు.

 

 

?igsh=YjFkenJhaDkxcmZn

Related News

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

Big Stories

Advertisement
×