Mushfiqur Rahim: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan ) మధ్య రెండో టెస్టు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇప్పటికే బంగ్లాదేశ్ విజయం సాధించగా, రెండో టెస్టులో కూడా అదరగొడుతోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసిన ముష్ఫిఖర్ రహీం ( Mushfiqur Rahim) చేసిన పని హాట్ టాపిక్ అయింది. సెంచరీ నమోదు చేసుకున్న తర్వాత సజీద్ ఖాన్ ( Sajid Khan) బౌలింగ్ లో ఔట్ అయ్యాడు ముష్ఫిఖర్ రహీం. అయితే, పెవిలియన్ కు వెళ్లే క్రమంలో తన హెల్మెట్ ను కాలితో గట్టిగా తన్నాడు. దీంతో ఆ హెల్మెట్ 10 మీటర్ల అవతల పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారింది. 137 పరుగులు చేసిన ముష్ఫిఖర్ రహీం… 150 పరుగులకు చేరుకోలేదన్న కోపంతో ఇలా చేసి ఉంటాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan ) మధ్య ప్రస్తుతం రెండవ టెస్ట్ మూడవ రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ముందు 437 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది బంగ్లాదేశ్. అయితే అంతకుముందు రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ అదరగొట్టింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో ముష్ఫిఖర్ రహీం ( Mushfiqur Rahim) 233 బంతుల్లో 137 పరుగులు సాధించాడు. తన టెస్ట్ కెరీర్ లో 14వ సెంచరీని నమోదు చేసుకున్నాడు ముష్ఫిఖర్ రహీం. అయితే 150 పరుగులు చేయక ముందే ముష్ఫిఖర్ రహీం ఔట్ అయ్యాడు. దీంతో పెవిలియన్ కు వెళ్లేటప్పుడు అసహనంతో కనిపించాడు. తన హెల్మెట్ ను కాలితో ఫుట్ బాల్ తన్నినట్టు గట్టిగా తన్నేసాడు. దీంతో పది మీటర్ల దూరంలో హెల్మెట్ పడింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ముష్ఫిఖర్ రహీం పై సీరియస్ అవుతున్నారు. 39 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంత కోపం ఎందుకని ప్రశ్నిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఇందులో పాకిస్తాన్ ముందు బంగ్లాదేశ్ 437 పరుగుల టార్గెట్ పెట్టింది. ఈ లక్ష్యాన్ని రెండు రోజుల్లో పాకిస్తాన్ ఛేదించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 278 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు సాధించింది. ఇక పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో 232 పరుగులకు ఆల్ అవుట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంది.