Samantha: సమంతను టీమిండియా స్టార్ ఆటగాడు, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కలిసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాను సమంతాను కలిశానని.. ఆమె తనకు ట్రీట్మెంట్ ఇచ్చిందని టీమిండియా స్టార్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా కీలక పోస్ట్ పెట్టాడు. దీంతో అందరూ హీరోయిన్ సమంతను నితీష్ కుమార్ రెడ్డి కలిసినట్లు చర్చించుకుంటున్నారు. అంతే కాదు సమంత అలాగే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మధ్య ఏదో సంబంధం ఉందని కూడా దారుణంగా పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కలిసింది హీరోయిన్ సమంత కాదు. డాక్టర్ సమంతాను కలిశారు నితీష్ కుమార్ రెడ్డి. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Also Read: Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
సమంతను కలిసిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇటీవల టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ సందర్భంగా… తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కాలికి గాయమైంది. దీంతో తర్వాతి మ్యాచ్ కు దూరమయ్యాడు నితిష్ కుమార్ రెడ్డి. అనంతరం నితీష్ కుమార్ రెడ్డి.. తన కాలికి సర్జరీ అయిందని కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. అయితే ఆ సర్జరీ అనంతరం… కోలుకున్న నితీష్ కుమార్ రెడ్డి….. ప్రస్తుతం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కూడా ఆడుతున్నాడు.
అయితే… ఇవాళ నితీష్ కుమార్ రెడ్డి పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. తాను సమంత దగ్గరికి వెళ్లానని… ఆమె తనను కాపాడింది అంటూ.. ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే సమంత పేరు రాగానే అందరూ హీరోయిన్ పేరే గుర్తు తెచ్చుకుంటున్నారు. హీరోయిన్ సమంతను నితీష్ కుమార్ రెడ్డి కలిశాడాని పులిహోర కలుపుతున్నారు. కానీ అతని పోస్టు… సరిగ్గా చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఆమె పెద్ద డాక్టర్ అట. ముఖ్యంగా స్కిన్ స్పెషలిస్ట్ అని నితీష్ కుమార్ రెడ్డి వెల్లడించాడు. ఆసుపత్రి పేరు కూడా సమంత క్లినిక్ అని క్లారిటీ ఇచ్చాడు. ఆమె కారణంగానే తనలో మార్పు వచ్చిందని తెలిపాడు. తన లెగ్ సర్జరీ సమయంలో కూడా ఆమె ఎంతో సహాయపడిందని చెప్పుకొచ్చాడు నీతిష్ కుమార్ రెడ్డి. అంతేకానీ హీరోయిన్ సమంత నితీష్ కుమార్ రెడ్డి కలవలేదు.
ఇది ఇలా ఉండగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్… టీమిండియాలో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో… కీలక ప్లేయర్ గా కూడా ఉన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలోనే గత ఏడాది నుంచి టీమిండియాలో పదిలంగా స్థానాన్ని సంపాదిస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో అతన్ని తీసుకుంటారా లేదా అనేది చూడాలి.
https://www.instagram.com/stories/nitishkumarreddy/