Nayanthara: స్టార్ నటి నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ విపరీతంగా అభిమానులను సొంతం చేసుకుంది. తన నటన అందచందాలకు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. నయనతార సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులు ఎగబడి చూసేవారు. నయనతార వయసు పెరిగినప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంటుంది.
Also Read: Neeraj Chopra’s wife : నీరజ్ చోప్రా భార్యకు పట్టిన దరిద్రం.. 1.5 కోట్ల జాబ్, సర్వం కోల్పోయిందిగా!
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు సినిమాలలో పెద్దగా నటించడం లేదు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తోంది. తన తదుపరి సినిమాను తెలుగులో మెగా హీరో చిరంజీవితో చేయనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో నటించడానికి నయనతార భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా… ఒకప్పుడు నయనతార సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది హీరోలతో సీక్రెట్ గా ప్రేమాయణం నడిపింది. అంతేకాకుండా వివాహం కూడా చేసుకోవాలని అనుకుందట. అందులో ప్రముఖ హీరో శింబు ఒకరు. వీరిద్దరూ చాలా కాలం పాటు సీక్రెట్ గా ఎ**ఫైర్ కొనసాగించారు. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు.
అనంతరం నయనతార స్టార్ హీరో, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన ప్రభుదేవాను ప్రేమించి వివాహం చేసుకోవాలని అనుకుంది. చాలా కాలం పాటు ప్రేమాయణం నడిపిన ఈ జంట ఏవో సమస్యల కారణంగా విడిపోయారు. ఇక ఈ లిస్ట్ లో టీమిండియా ప్లేయర్ కూడా ఉన్నాడట. అయితే అతని పేరు మాత్రం బయటకు రాలేదు. అనంతరం నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు ప్రేమించుకున్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరుపుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక నయనతార వివాహం జరిగి పిల్లలు ఉన్న ఎప్పటిలానే సినిమాలు చేస్తోంది. సమయం దొరికినప్పుడల్లా తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
Also Read: Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతాయి. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. ఇక నయనతార కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా బిజినెస్ వ్యవహారాలను కూడా చూసుకుంటుంది. కొన్ని రకాల బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తారు. తనకు సమయం దొరికినప్పుడల్లా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేస్తుంది.