E-Paper
Advertisement

ISPL Season 3: కారులోనే గ్రౌండ్ లోకి స‌చిన్..ISPL Season 3 షెడ్యూల్, ఫ్రీగా ఎలా చూడాలంటే

ISPL Season 3: కారులోనే గ్రౌండ్ లోకి స‌చిన్..ISPL Season 3 షెడ్యూల్, ఫ్రీగా ఎలా చూడాలంటే
Advertisement

ISPL Season 3: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇండియాలో మరో పొట్టి ఫార్మాట్ క్రికెట్ ప్రారంభమైంది. గత రెండు సంవత్సరాలుగా అద్భుతంగా కొనసాగిన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు మళ్లీ షురూ అయింది. సీజన్ 3 ( ISPL Season 3) నిన్నటితో ప్రారంభమైంది. ఈ మేరకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ), అమితా బచ్చన్, రామ్ చరణ్, సూర్య, అక్షయ్ కుమార్, లాంటి దిగ్గజాల ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. అయితే ఈ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 (Indian Street Premier League) ప్రారంభం అయిన నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ ఓ లగ్జరీ కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా గ్రౌండ్ లోకి తన కారును తీసుకువచ్చారు. గుజరాత్ లో ఉన్న సూరత్ లాల్ భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ఈ ఈవెంట్ ప్రారంభం కాగా.. సచిన్ టెండూల్కర్ తన రూ.3.6 కోట్ల పోర్స్చే 911 కారులో ఎంట్రీ ఇచ్చాడు.

Also Read: Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?

కారులోనే గ్రౌండ్ లోకి స‌చిన్

Advertisement

 

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నిన్న ప్రారంభమైంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఉన్న లాల్ భాయ్ స్టేడియంలో ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ఎంట్రీ సెంటర్ ఆఫ్ యాక్షన్ గా నిలిచింది. తన మూడున్నర కోట్ల Porsche 911 Carrera ఎర్ర కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సచిన్ టెండూల్కర్. అలాగే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన టైటిల్ కూడా తన కారులోనే తీసుకువచ్చాడు. దీంతో సచిన్ తీసుకువచ్చిన Porsche 911 Carrera కారు వీడియో వైరల్ గా మారింది. ఈ కారు నాలుగు సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని దూసుకు వెళ్లగలుగుతుంది. అలాగే, ఈ కారు గంటకు 294 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకు వెళ్తుందట.

ISPL Season 3 షెడ్యూల్ ,ఫ్రీగా చూడాలంటే

Advertisement

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 ( ISPL Season 3 ) జనవరి 9 అంటే నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఫిబ్ర‌వరి 6వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రామ్ చరణ్ ఓనర్ గా ఉండగా, మాజీ ముంబై జట్టుకు అమితా బచ్చన్ ఓనర్ గా కొనసాగుతున్నాడు. అలాగే శ్రీనగర్ కెవిఆర్ జట్టుకు అక్షయ్ కుమార్, చెన్నై సింగంస్ జట్టుకు సూర్య ఓనర్ గా కొనసాగుతున్నాడు. టైగర్స్ ఆఫ్ కోల్ క‌తా జట్టుకు కరీనాకపూర్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ ఓనర్లుగా ఉన్నారు. ఢిల్లీ సూపర్ హీరోస్ జట్టుకు సల్మాన్ ఖాన్ అలాగే బెంగళూరు స్ట్రైకర్ జట్టుకు హృతిక్ రోషన్ ఓనర్ గా కనిపిస్తాడు. అహ్మదాబాద్ లయన్స్ జట్టుకు అజయ్ దేవగన్ ఓనర్ గా ఉంటాడు. ఇందులో గెలిచిన జట్టుకు రెండు కోట్లు, ఫైనల్స్ లో ఓడిన రన్నరప్ జట్టుకు కోటి రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. ఈ టోర్న‌మెంట్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో చూడవ‌చ్చు.

 

?igsh=NTVidmR1eGJieWg0

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×