E-Paper
Advertisement

సాయి సుద‌ర్శ‌న్ అస‌లు ఔటే కాదు..? అంపైర్ అనిల్ చౌద‌రీ సంచ‌ల‌నం

సాయి సుద‌ర్శ‌న్ అస‌లు ఔటే కాదు..? అంపైర్ అనిల్ చౌద‌రీ సంచ‌ల‌నం
Advertisement

Sai Sudharshan Hit Wicket:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Qualifier 1) మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బెంగుళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి, ఫైనల్స్ బరిలో నిలిచింది. అయితే, ఈ సీజన్ లో అద్భుతంగా రాణించిన గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్.. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ సందర్భంగా హిట్ వికెట్ (Sai Sudharshan Hit Wicket) అయ్యాడు. 14 పరుగులు చేసిన నేపథ్యంలో జాకబ్ డఫ్ఫీ బౌలింగ్ లో సాయి సుదర్శన్ హిట్ వికెట్ కావడంతో, గుజరాత్ కోలుకోలేకపోయింది. ఫలితంగా బెంగళూరు చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సాయి సుదర్శన్ హిట్ వికెట్ పై కొత్త వివాదం రాజుకుంది. అసలు అతడు ఔట్ కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు గుజరాత్ అభిమానులు.

Also Read: Vaibhav-Parag: వైభ‌వ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బ‌య‌ట‌పెట్టిన‌ రియాన్ ప‌రాగ్, ఇదిగో షాకింగ్ వీడియో 

సాయి సుద‌ర్శ‌న్ అస‌లు ఔటే కాదు – అనిల్ చౌద‌రీ

Advertisement

బెంగళూరు తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ సందర్భంగా సాయి సుదర్శన్ హిట్ వికెట్ పైన సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అతను అసలు ఔట్ కాదంటూ గుజరాత్ సపోర్టర్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. అంతేకాదు, మాజీ ఐసీసీ అంపైర్ అనిల్ చౌదరీ కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు వీడియో వైరల్ చేస్తున్నారు. అసలు అంపైర్ అనిల్ ఏం చెప్పారంటే.. గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ తన షాట్ ను పూర్తి పూర్తి చేశాడట. అంటే అప్పటికే బంతి డెడ్ బాల్ అయిపోయిందని ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఈ లెక్క‌న సాయి ఔట్ కాద‌ని పేర్కొన్నారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు తన షాట్ పూర్తి చేసిన తర్వాత హిట్ వికెట్ కావడానికి ఛాన్సే ఉండదని అనిల్ చౌదరీ చెప్పే ప్రయత్నం చేశారు.

అంటే ఒక బంతిని షాట్ ఆడిన తర్వాత.. బ్యాటర్ కు సంబంధించిన బ్యాట్, క్యాప్, ఇతర ఏ వస్తువైనా వికెట్లను తగిలితే… అది హిట్ వికెట్ గా పరిగణించకూడదని చెప్పారు. అనిల్ చెప్పిన‌ ప్రకారం సాయి సుదర్శన్ కూడా నాట్ ఔట్ గా మిగులుతాడు. ఈ క్రమంలోనే అనిల్ చౌదరీ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు గుజరాత్ అభిమానులు. వాస్తవంగా అనిల్ చౌదరీ తన సోషల్ మీడియా వేదికగా సాయి సుదర్శన్ వికెట్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. అచ్చం ఇలాంటి సంఘటనే గతంలో జరిగితే.. అనిల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ వీడియోను సాయి సుదర్శన్ హిట్ వికెట్ కు సింక్ చేస్తూ చేసి గుజరాత్ అభిమానులు రచ్చ చేస్తున్నారు. మ్యాచ్ అయిపోయిన త‌ర్వాత‌ సోషల్ మీడియా వేదికగా ఇంత రచ్చ చేస్తే, లాభం పెద్దగా ఉండదు. మ్యాచ్ అయిపోగానే ఆ విషయాన్ని మర్చిపోవాలని బెంగుళూరు అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. హిట్ వికెట్ కాకపోయినా.. సాయి సుదర్శన్ ను తర్వాతి బంతికైనా ఔట్ చేసే వాళ్ళమని చురకలు అంటిస్తున్నారు.

Advertisement

Also Read:  Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

 

?igsh=MWtuNGdmejIwYzJmdg==

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×