E-Paper
Advertisement

Sam Billings: న‌మాజ్ చేయాల‌ని రిజ్వాన్ టార్చ‌ర్ చేస్తున్నాడు..డ్రెస్సింగ్ రూంలో న‌ర‌కం చూపిస్తున్నాడు

Sam Billings: న‌మాజ్ చేయాల‌ని రిజ్వాన్ టార్చ‌ర్ చేస్తున్నాడు..డ్రెస్సింగ్ రూంలో న‌ర‌కం చూపిస్తున్నాడు

Sam Billings:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) నేపథ్యంలో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఇప్పటికే మరియం నవాజ్ షరీఫ్ పైన న‌సీమ్ షా వివాదాస్పద పోస్ట్ పెట్టగా.. ఆ తర్వాత బాల్ టాంపరింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. మొన్న‌టికి మొన్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో డేవిడ్ వార్నర్ అడ్డంగా దొరికిపోయాడు. ఇక తాజాగా రావాల్పిండిజ్ జట్టుకు ( Rawalpindiz Cricket Team) సంబంధించిన మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan ) వివాదంలో చిక్కుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో తన తోటి క్రికెటర్లను నమాజ్ చేయాలని టార్చర్ చేస్తున్నాడట మహమ్మద్ రిజ్వాన్. రావాల్పిండిజ్ కు సంబంధించిన‌ విదేశీ క్రికెటర్లను కూడా నమాజ్ చేయించే ప్రయత్నం చేస్తున్నాడని, తాజాగా అదే జట్టుకు సంబంధించిన సామ్ బిల్లింగ్స్ ( Sam Billings) ఆరోపణలు చేశారు. దీని వల్ల తన మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని బాంబు పేల్చాడు. దీంతో మహమ్మద్ రిజ్వాన్ పై సామ్ బిల్లింగ్స్ చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి.

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

న‌మాజ్ చేయాల‌ని రిజ్వాన్ టార్చ‌ర్ చేస్తున్నాడు..

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) ప్రేక్షకులు లేకుండా జరుగుతున్నప్పటికీ ఇందులో ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. తాజాగా మహమ్మద్ రిజ్వాన్ గురించి షాకింగ్ నిజాలు బయట వచ్చాయి. రావాల్పిండిజ్ జట్టుకు ( Rawalpindiz Cricket Team) సంబంధించిన ప్లేయర్లంద‌రితో బలవంతంగా నమాజ్ చేయిస్తున్నాడట మహమ్మద్ రిజ్వాన్. ఈ మేరకు రావాల్పిండిజ్ జట్టుకు సంబంధించిన బ్యాటర్ సామ్ బిల్లింగ్స్ సంచలన ఆరోపణలు చేశాడు. తమ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, ఇతర ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్ లోనే నమాజ్ చేయడం ప్రారంభించారని ఫైరయ్యారు.

వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి.. ప్లేయర్ లందరూ రోజు మొత్తం నమాజ్ చేయాలని సందేశాలు పంపుతున్నాడని మహమ్మద్ రిజ్వాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతి శుక్రవారం జట్టులో ఉన్న సభ్యులందరినీ మసీద్ కు తీసుకు వెళ్తున్నాడని కూడా ఫైర్ అయ్యాడు. ఒక క్రికెట్ లీగ్ లో కాకుండా తాను ఒక మత పాఠశాలలో చేరినట్లుగా ఇప్పుడు అనిపిస్తోందని సీరియస్ అయ్యాడు. ఇలా పదే పదే నమాజ్ చేయడం వల్ల క్రికెట్ పైన దృష్టి పెట్టలేకపోతున్నానని కూడా బాంబు పేల్చారు సామ్ బిల్లింగ్స్‌.

ముస్లిం మతంలోకి మారాలని డేవిడ్ వార్నర్ కు టార్చర్

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు లో ఆడుతున్న డేవిడ్ వార్నర్ ను మహమ్మద్ రిజ్వాన్ టార్చర్ పెడుతున్నాడట. ముస్లిం మతంలోకి మారాలని కోరుతున్నాడట. ముస్లిం మతంలోకి మారితే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో పర్మనెంట్గా నువ్వు ఉండవచ్చని సూచనలు చేస్తున్నాడట. ఈ విషయాన్ని వారం కిందట డేవిడ్ వార్నర్ కూడా రివీల్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

 

https://www.facebook.com/photo/?fbid=1503633185107228&set=a.651057723698116

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×