BigTV English

Sania Mirza : అద్దంలో నేను.. విడాకుల తర్వాత సానియా ఫస్ట్ పోస్ట్..!

Sania Mirza : అద్దంలో నేను.. విడాకుల తర్వాత సానియా ఫస్ట్ పోస్ట్..!

Sania Mirza : పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో  విడాకుల తర్వాత, సానియా మీర్జా తొలిసారి స్పందించింది. అయితే అది తన విడాకులపై కాదు.. మామూలుగా అద్దంలో చూసుకుంటున్న ఫొటో ఒకటి తీసి, ఇన్ స్టాలో పెట్టింది. అయితే అందులో చిన్న క్యాప్షన్ రాసింది. అదిప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.


ఇంతకీ అదేమిటంటే .. ‘రిఫ్లెక్ట్ ’ అని మాత్రమే రాసింది. ఇప్పుడు దానర్థం ఏమిటని, అందరూ నెట్టింట తెగ వెతికేస్తున్నారు. దానికి రకరకాల భాష్యాలు చెబుతున్నారు. రిఫ్లెక్ట్ అని రాసింది కాబట్టి, విడాకుల తర్వాత ‘నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది’ అని ఒకరు రాశారు. మరొకరేమో ‘ఇప్పుడే నేను స్వేచ్ఛగా, ఆనందంగా ఉన్నాను’ అని రాసుకొచ్చారు. ఒకరేమో అద్దంలో తను కనిపిస్తోంది. కానీ ఫొటో వెనుక నుంచి ఉంది కాబట్టి, ‘అది ఆమె మనసు ప్రతిబింబం’ అని రాసుకొచ్చారు. ఒక్క ఫొటో, ఎన్నో ప్రతిబింబాల్లా సానియా కనిపిస్తోందని కొందరు రాశారు.

విడాకుల తర్వాత మీడియాలో వస్తున్న కథనాలపై సానియా స్పందించలేదు. ఆమె తండ్రి స్పందించి షోయబ్ మాలిక్ మరో వివాహంపై అభినందనలు తెలిపాడు. అలాగే సానియా మీర్జాకి తన వ్యక్తిగత జీవితం విషయంలో గోప్యతగా ఉండాలని  భావిస్తోందని అన్నాడు. అందువల్ల ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు సానియా మీర్జా తనంతట తాను స్పందించి ఒక ఫొటో పెట్టి, సోషల్ మీడియాకి పెద్ద పని చెప్పింది.


ఆ ఫొటోని బట్టి చూస్తే, సానియా మీర్జా మళ్లీ బయటి ప్రపంచంలోకి రావడానికి రెడీగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ వివాహబంధనం నుంచి త్వరగానే బయటపడినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచో వారు విడాకులు తీసుకోవాలని అనుకోవడం వల్ల, సడన్ సర్ ప్రైజ్ గా ఎవరూ భావించలేదు.

కాకపోతే షోయబ్ మాలిక్ వెంటనే పెళ్లి చేసుకుని, తనంతట తాను ఓపెన్ కావడంతో అది కాస్తా రచ్చరచ్చ అయ్యింది. గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటే ఏ గొడవా ఉండేది కాదు. పబ్లిక్ లో పెట్టి, అందరినీ వీధిలోకి తీసుకొచ్చాడనే విమర్శలు నెట్టింట వినిపించాయి. 

మొత్తానికి అయితే అయ్యింది. తిరిగి సానియా మీర్జా మామూలు మనిషైందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జీవితం హాయిగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×