E-Paper
Advertisement

Iran Hospital : అగ్నికీలల్లో ఇరాన్ గాంధీ ఆస్పత్రి..!

Iran Hospital : అగ్నికీలల్లో ఇరాన్ గాంధీ ఆస్పత్రి..!
Advertisement
Iran Hospital

Iran Hospital : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రి అగ్నికీలల్లో చిక్కుకుంది. ఆస్పత్రి భవనం ముందుభాగంలో మంటలు ఎగసిపడుతున్న వీడియోను మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ‘ఎక్స్’లో స్పుత్నిక్ న్యూస్ ఏజెన్సీ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదం దరిమిలా 80 మంది రోగులను హుటాహుటిన తరలించారు. ఇతర ఆస్పత్రులకు వారందరినీ చేర్చినట్టు ఇరాన్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి పెడ్రం పాక్ అయిన్ వెల్లడించారు.

సిబ్బంది, పేషంట్లలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. మంటలు ఎగసి పడటానికి కారణాలు తెలియరావాల్సి ఉంది. ఆస్పత్రి భవనం వెలుపలి నుంచి మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక సమాచారం. ఉత్తర టెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రిలో 100 పడకలు ఉన్నాయి. 17 ఆపరేషన్ల థియేటర్లు, 100 గదులు ఉన్నాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఆస్పత్రిలో ఎంత మంది రోగులకు చికిత్స అందుతున్నదన్నదీ కచ్చితంగా తెలియడం లేదు.

Advertisement

నిరుడు ఆగస్టులో గ్రాండ్‌బజార్‌లో అగ్నిప్రమాదం వల్ల పలు దుకాణాలు ధ్వంసం కాగా.. పలువురు గాయపడ్డారు. జూన్ 2020లో నార్తర్న్ టెహ్రాన్‌లో ఓ క్లినిక్‌లో గ్యాస్ సిలిండర్లు పేలి. 19 మంది మరణించారు. జనవరి 2017లో 15 అంతస్తుల ప్లాస్కో షాపింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగి 22 మంది మరణించారు. వీరిలో 16 మంది అగ్నిమాపక సిబ్బందే.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×