E-Paper
Advertisement

PSL 2026: బ్యాట్ విరగ్గొట్టిన షాహిన్ అఫ్రిది.. బ్యాన్ విధించేందుకు PCB రంగం సిద్ధం

PSL 2026: బ్యాట్ విరగ్గొట్టిన షాహిన్ అఫ్రిది.. బ్యాన్ విధించేందుకు PCB రంగం సిద్ధం
Advertisement

PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నీ 2026 (Pakistan super league 2026 tournament) ఎంతో ఆసక్తికరంగా జరుగుతోంది. ఈ టోర్నీలోని ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. టోర్నీ ప్రారంభంలో నసీమ్ షా ట్వీట్ నుంచి మొదలుకొని.. డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వరకు అన్నీ వివాదాలే. ఇక తాజాగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది మైదానంలో తన ప్రవర్తనతో మరోసారి వివాదంలో నిలిచాడు. ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 లో ఏప్రిల్ 17న నేషనల్ స్టేడియం కరాచీ వేదికగా లాహోర్ ఖలందర్స్ – క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో షాహిన్ షా అఫ్రీది ప్రవర్తించిన తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

అసలేం జరిగిందంటే..?

Advertisement

లాహోర్ ఖలందర్స్ – క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య శుక్రవారం రోజు జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ జట్టు 19.5 ఓవర్లలో 134 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం 135 పరుగుల లక్ష్య చేదనకు దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ 16.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. అయితే ఈ మ్యాచ్ లో లాహోర్ ఖలందర్స్ జట్టు 60 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఇన్నింగ్స్ ని చక్కదిద్దాల్సిన బాధ్యతను తీసుకున్న కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది.. సాధారణ బ్యాటర్ల కంటే ముందే బ్యాటింగ్ కి వచ్చాడు. కానీ క్రీజ్ లోకి వచ్చిన మొదటి బంతికే (గోల్డెన్ డక్) స్పిన్నర్ ఉస్మాన్ తారీక్ బౌలింగ్ లో స్లిప్ ఫీల్డర్ సౌద్ షకీల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

కోపంతో ఊగిపోయిన ఆఫ్రిది:

Advertisement

అవుట్ అయిన తర్వాత షాహిన్ షా ఆఫ్రిది తీవ్ర అసహనానికి గురయ్యాడు. పెవిలియన్ వైపు వెళ్తూ తన బ్యాట్ ని బౌండరీ లైన్ మరియు సైట్ స్క్రీన్ టైర్లకు గట్టిగా కొట్టాడు. అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్ మెట్ల దగ్గరికి చేరుకున్నాక కూడా అతడి కోపం తగ్గలేదు. అక్కడే బ్యాట్ ని మెట్లకు కొట్టి రెండు ముక్కలుగా విరగ్గొట్టాడు. ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు. బ్యాటింగ్ లో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ కీలక సమయంలో నిలకడగా ఆడే బ్యాటర్లను పక్కనపెట్టి.. తను ముందే బ్యాటింగ్ కి రావడం బాధ్యతారాహిత్యం అని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఆటలో అవుట్ కావడం అనేది సహజమని.. కానీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఇలా బ్యాట్ విరగొట్టడం అగౌరవంగా ఉందని నెటిజెన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో అఫ్రీదిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు లాహోర్ ఖలందర్స్ జట్టు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండడం, కెప్టెన్ గా జట్టును నడిపించడంలో అఫ్రీది విఫలం కావడంపై కూడా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Related News

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×