Ivana on Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో మొన్నటి వరకు బిజీగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ ఇవానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా లవ్ టుడే సినిమాతో… ఇనావాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని నిర్మాతగా తమిళంలో ( Tamil) ఓ సినిమా చేశాడు. ఆ సినిమానే LGM. ధోని నిర్మాతగా చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా ఇనావా ( inava ) నటించింది. ఈ సినిమా 2023 సంవత్సరంలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.
మహేంద్ర సింగ్ ధోనీ పై హీరోయిన్ హాట్ కామెంట్స్
మహేంద్ర సింగ్ ధోని ( Ms Dhoni) అంటే.. ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఆయనకు కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు. టీమిండియా జట్టుకు మూడు ఐసీసీ టోర్నమెంట్లు తెచ్చిన ఘనత మహేంద్రసింగ్ ధోనిది. మూలన ఉన్న టీం ఇండియాను అగ్రస్థానానికి చేర్చాడు మహేంద్రసింగ్ ధోని. ఆయన ఏది పట్టిన బంగారమే అవుతుంది. అందుకే అతి తక్కువ కాలంలోనే మహేంద్ర సింగ్ ధోని సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచారు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ పై… హీరోయిన్ ఇనావా హాట్ కామెంట్స్ చేశారు.
మహేంద్ర సింగ్ ధోని అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆయనతో వర్క్ చేయడం తన అదృష్టమని.. పొగిడారు. వాస్తవానికి మహేంద్రసింగ్ ధోనీని చాలా దూరం నుంచి మొదట చూసానని వెల్లడించారు. ఆ తర్వాత ఒకసారి దగ్గర నుంచి చూసి షాక్ అయ్యానని… తెలిపారు. ఆ సమయంలో మహేంద్రసింగ్ ధోని బ్లాక్ షూట్ లో మెరిసినట్లు ఈ సందర్భంగా పేర్కొంది హీరోయిన్ ఇనావా. అప్పుడు మహేంద్ర సింగ్ ధోని అంటే రెస్పెక్ట్ బాగా పెరిగిందని తెలిపింది. ఏమున్నార్రా బాబు అని ఫీల్ అయినట్లు వెల్లడించింది. ధోని నిర్మాతగా చేసిన సినిమాలోకి తాను వస్తానని అస్సలు ఊహించలేదని పేర్కొన్నారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన మొదటి సినిమాలోనే తనకు అవకాశం రావడం గర్వకారణమై పేర్కొన్నారు.
హీరోయిన్ ఇనావా కామెంట్స్ తో రచ్చ
మహేంద్ర సింగ్ ధోనీ పై తమిళ హీరోయిన్ ఇనావా కామెంట్స్ చేయడం… ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సాక్షి సింగ్ కాపురంలో చిచ్చుపెట్టేందుకు హీరోయిన్ ఇలా మాట్లాడుతోందని కొంతమంది ధోని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ధోని అంటే దేవుడు లాంటి వాడు.. అలాంటి ధోనిపై ఇలా… హీరోయిన్ కామెంట్ చేయడం దారుణం అంటున్నారు. ఆమె వేరే యాంగిల్ లో ధోనిని ఊహించుకుంటుందని… కానీ మహేంద్ర సింగ్ ధోని… సాక్షికి ( Sakshi Dhoni) మాత్రమే సొంతం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని విషయంలో కాస్త సాక్షి జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు ఫ్యాన్స్.
?igsh=MWoyaWdzbzlqN3Z5cw%3D%3D