India Attack on Pakistan: కౌంటర్ కు ఎన్ కౌంటర్. దెబ్బకు దెబ్బ. పాకిస్తాన్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. భారత్ పై దాడికి తెగబడడం ద్వారా ఈసారి పాక్ చాలా పెద్ద దుస్సాహసమే చేసింది. ఇక ఎవరు చెప్పినా వినేదే లేదు. వెనక్కు తగ్గేదే లేదు. తాడో పేడో తేలిపోవాలంతే. ఎప్పుడూ పక్కలో బళ్లెంలా భారత్ కు ఇదో పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు ఎలాగూ వార్ లైక్ సిచ్యువేషన్ ఏర్పడింది కాబట్టి మొత్తం పీఓకేలో ఉగ్ర స్థావరాలతో పాటే.. పాకిస్తాన్ ఏం చూసుకుని రెచ్చిపోతోందో వాటన్నిటినీ ధ్వంసం చేయడమే భారత్ ముందున్న టార్గెట్.
గగనతలం.. ( ఎయిర్ ఎటాక్స్ )
జలమార్గం.. ( నేవీ ఎటాక్, కరాచీ)
భూతలం.. ( శతఘ్నులతో పేల్చేవి )
ఈ మూడు మార్గాల్లో భారత దళాలు యాక్టివేట్ అయ్యాయి. ఇక పాకిస్తాన్ కు చుక్కలే. అవును తన స్థాయికి మించి దాయాది రియాక్ట్ అయింది. ఇప్పుడు అనుభవించక తప్పని పరిస్థితి. యుద్ధంలో దిగాక తప్పదు. బలం లేనప్పుడు నష్టపోవాల్సిందే. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ కు పెద్ద సవాల్ గా మారింది. ఆ దేశంలో యుద్ధం వద్దు.. అంతా ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారని జనం క్వశ్చన్ చేస్తున్నారు. అయితే భారత్ తో పోలిస్తే ఏమాత్రం బలం లేని పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధంలో ఎలాంటి టర్న్ తీసుకోబోతోందన్నదే కీలకం.
యుద్ధం కంటిన్యూ అవుతుందా? ఆపేస్తారా?
ఇప్పుడు కామన్ మ్యాన్ లో ఒకటే ప్రశ్న. ఈ యుద్ధం కంటిన్యూ అవుతుందా? భారత్ ఏం చేయబోతోంది? పాకిస్తాన్ ఏం చేస్తుంది? యుద్ధం కొనసాగితే ఎన్ని రోజులు ఉంటుంది? ఎప్పుడు ముగుస్తుంది.. ఎలా ముగుస్తుంది? అయితే వీటికి జవాబులు ఎవరి చేతుల్లోనూ లేవు. పాకిస్తాన్ ఎంతో కొంత రియాక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. వాటిని మన S 400 యాంటీ మిసైల్ సిస్టమ్ కూల్చేస్తోంది. సో వారి ఆటలు సాగడం లేదు. ఎక్కడా పెద్దగా వారి పాచికలు పారడం లేదు. అయితే పాకిస్తాన్ అదును కోసం వేచి చూడడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ కు ఏదైనా భారీ ఎదురుదెబ్బ తగిలేలా ప్లాన్ చేసుకుంటోంది. పాక్ ఎన్ని ఎత్తులు వేసినా వాటిని ఫెయిల్ చేసేందుకు భారత్ రెడీ అంటోంది.
యుద్ధం దాకా వచ్చిన పాక్ కు బుద్ధి చెప్పే యత్నం
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడూ ఇప్పుడు యాక్టివేట్ అయ్యాయి. శత్రువును తుదముట్టించేందుకు సిద్ధమంటున్నాయి. పనిలో పనిగా పీఓకే స్వాధీనం చేసుకోవాలన్న సూచనలు కూడా వస్తున్నాయి. ఇదే అదును అని కూడా అంటున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో తలనొప్పులు, టెర్రర్ క్యాంప్స్ ఉండొద్దంటే పీఓకేను విలీనం చేసుకోవాలంటున్నారు. సో యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువ. మనపై దాడి చేసే దాకా వచ్చిన పాకిస్తాన్ కు బుద్ధి చెప్పకపోతే ఎలా.. సరిగ్గా భారత ప్రభుత్వం అదే చేస్తోంది.
చైనా సపోర్ట్ ఉన్నన్ని రోజులు పాక్ పోరాటం
నిజానికి యుద్ధం పైకి పాకిస్తాన్ తో చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. పరోక్షంగా చేస్తోంది చైనాతోనే. ఎందుకంటే చైనా సప్లై చేసే వెపన్స్, డ్రోన్లు, మిసైళ్లపైనే పాక్ ఆధారపడి ఉంది. ఎన్ని రోజులు అలా సప్లై చేస్తే అన్ని రోజులు యుద్ధం చేస్తుందన్న మాట. ఆ తర్వాత షరామూమూలుగా తోక ముడుస్తుంది. అయితే చైనా సామాన్ ను నమ్ముకుంటే పాకిస్తాన్ కు కష్టాలు తప్పడం లేదు. ఒక్కటీ టార్గెట్ చేరడం లేదు. దీంతో ముందుకు వెళ్లాలా వద్దా అన్న ఆలోచనలో పాక్ నేతలున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో పాక్ మ్యాప్ కు దండ వేసేస్తున్నారు కూడా.
మనదేశంలోని 15 నగరాలపై దాడులకు పాక్ ప్లాన్
ఎక్కడి పాకిస్తాన్.. ఎవరిపై దుస్సాహసం.. గెలవలేమని తెలిసి కూడా.. మనదేశంలోని 15 నగరాలపై దాడులకు తెగబడింది. వీటిని భారత సైన్యం తిప్పికొట్టింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను మన మిలిటరీ నిర్వీర్యం చేసింది. అవంతిపురా నుంచి భుజ్ వరకు జరిగిన దాడులను యాంటీ-యూఏవీ, క్షిపణి రక్షణ వ్యవస్థలను ఉపయోగించి సమర్థంగా తిప్పికొట్టింది. భారత గడ్డపై ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరగకుండా ఆర్మీ చూసుకుంది. పాకిస్తాన్ టార్గెట్ చేసిన ప్రాంతాలు అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్ సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్లై, భుజ్ ఉన్నాయి. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు.
LOC వెంట కాల్పులకు తెగబడుతున్న పాక్
చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను పాకిస్థాన్ వాడుతోంది. వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా భారత్ అడ్డుకుంటోంది. అదే సమయంలో మనం డ్రోన్లు, మిసైల్స్ తో దాడి చేస్తే పాకిస్తాన్ అడ్డుకోలేకపోతోంది. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మన క్షిపణి ధ్వంసం చేసింది. నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మెర్టార్లు, భారీ ఫిరంగులతో రెచ్చిపోతోంది. అయితే వీటికి భారత్ దీటైన సమాధానం చెబుతోంది. పాకిస్థాన్ దాడులకు రుజువుగా వాటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి ఆర్మీ సేకరిస్తోంది.
అసలు వ్యూహం లేదు. వ్యూ లేదు
పాకిస్తాన్ కు ఎన్ని రోజులు యుద్ధం చేసే కెపాసిటీ ఉంది? భారత్ గట్టిగా కదనరంగంలోకి దూకితే ఎన్ని రోజుల్లో కథ మారబోతోంది? భారత వ్యూహాలను పసిగట్టలేని పరిస్థితులో దాయాది ఉంది. అందుకే ఈసారి యుద్ధంలో టోటల్ గా కథ మార్చేయబోతోంది ఇండియా. ఇన్నాళ్లూ వేచి చూసింది చాలు.. ఇక చాప్టర్ క్లోజ్ అంటోంది. భారత స్ట్రాటజీ ముందు చేతులెత్తేస్తోంది. అసలు వ్యూహం లేదు. వ్యూ లేదు. అలాంటప్పుడు పాక్ ఎందుకు యుద్ధానికి కాలు దువ్విందన్నది పాక్ లో జనం క్వశ్చన్.
కోలుకోలేని విధంగా మారుతున్న పాక్
పాకిస్తాన్ జనం మొత్తుకుంటున్నారు యుద్ధం వద్దని. అయినా వింటేగా.. రెచ్చిపోయారు. ముందుకే అన్నారు. బీరాలు పలికారు. కానీ కథ మొత్తం మారిపోతోంది. పాక్ అన్ని విధాలుగా కోలుకోలేని పరిస్థితికి వెళ్లిపోతోంది. అయితే ఇంతదాకా వచ్చిన మ్యాటర్ ను భారత్ అంత ఈజీగా వదిలిపెట్టదు. ఎందుకంటే మనం దాడి చేస్తే పాక్ పౌరులు ఎవరూ చనిపోలేదు. కానీ పాక్ రేంజర్ల కాల్పుల్లో LOC దగ్గరి గ్రామాల్లోని మహిళలు, చిన్నపిల్లలు బలయ్యారు. ఇది పాకిస్తాన్ దుష్టనీతిని బయటపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కథను వేగంగా ముగించేందుకే ఆలోచిస్తోంది. మళ్లీ నోరెత్తొద్దు. అదీ మ్యాటర్.
మెడికల్ ఇన్ ఫ్రాపై నడ్డా ఫోకస్
సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. రక్షణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు చెప్పారు. ఎమర్జెన్సీకి సిద్ధంగా ఉండాలన్నారు. అటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా మెడికల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పై మీటింగ్ పెట్టారు. పౌరులపై దాడులు జరిగితే ట్రీట్ మెంట్ ఇచ్చేలా.. ప్రాణనష్టం తప్పించేలా ముందు జాగ్రత్త తీసుకుంటోంది. అటు త్రివిధ దళాలు, అన్ని రకాల బలగాల ప్రతినిధులతో హోంశాఖ, రక్షణశాఖ భేటీలు నిర్వహిస్తోంది.
కథను వేగంగా ముగించేందుకే ముందుకు
దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ రెయిడ్ సైరన్లు మోగించారు. ఇదంతా ముందు జాగ్రత్త కోసమే. దేశ రాజధానిపై పాకిస్తాన్ దాడికి ఒడిగట్టే యత్నం చేయదు. ఒకవేళ చేసినా అడ్డుకునే పరిస్థితి మన దగ్గర ఉంది. అయినా సరే ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అని జనాన్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎంతకైనా మంచిదని ఐపీఎల్ వారం వాయిదా వేశారు. పాక్ సరిహద్దు జిల్లాల్లో బ్లాక్ అవుట్ చేస్తున్నారు. సాయంత్రం ఐదు అయిందంటే మార్కెట్లు బంద్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది..? కచ్చితంగా పాకిస్తాన్ తో యుద్ధం కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
పాక్ దగ్గర 4 రోజులకే సరిపడా ఆయుధసామాగ్రి
అటు భారత్ చేసిన క్షిపణి, డ్రోన్ ఎటాక్స్ లో లాహోర్ రావల్పిండి, సియాల్ కోట్ లాంటి వాటినే టార్గెట్ చేసింది. పెద్దగా ఇస్లామాబాద్ జోలికి వెళ్లలేదు. కానీ నెక్ట్స్ టార్గెట్ ఇస్లామాబాద్ పూర్తిస్థాయిలో ఉండే అవకాశాలను కొట్టిపారేయలేం. అంతెందుకు పాకిస్తాన్ మనతో గట్టిగా యుద్ధం చేస్తే 4 రోజులకే సరిపడా ఆయుధ సామాగ్రి ఉంది. ఆ తర్వాత చేతులెత్తేయడమే. శరణు వేడుకోవడమే. అదీ కుదరకపోతే పలాయనమే. ఇదీ పాక్ పరిస్థితి కానీ. పైకి మాత్రం బిల్డప్. 155mm ఆర్టిలరీ షెల్స్, 122mm రాకెట్ల కొరత పాక్ కు తీవ్రంగా ఉంది.
హమాస్ మాదిరి భారత్ పై డ్రోన్ల వర్షం
డబ్బులు అవసరం కాబట్టి పాకిస్తాన్.. 2022-2023లో ఉక్రెయిన్‌కు 155mm ఆర్టిలరీ షెల్స్‌ను పెద్ద ఎత్తున అమ్ముకుంది. వీటి విలువ 364 మిలియన్ డాలర్లు. దీంతో దాని సొంత నిల్వలు తగ్గిపోయాయి. అయితే హమాస్ మాదిరిగా భారత్ పై డ్రోన్ల వర్షం కురిపించింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ లోని 24 నగరాలపై 500కు పైగా డ్రోన్లను ప్రయోగించింది పాక్. అయితే వాటిని భారత్ తిప్పి కొట్టడంతో నష్టం తప్పింది.
పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ 7.64 బిలియన్ డాలర్లు
పాకిస్తాన్ ఆయుధ కర్మాగారం.. ఓల్డ్ టెక్నిక్.. పెరిగిన గ్లోబల్ డిమాండ్ కారణంగా అమ్యునేషన్ తగినంత ప్రొడ్యూస్ చేయలేకపోతోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో రక్షణ బడ్జెట్ పరిమితంగా ఉంటోంది. 2025-26 లో పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ సుమారు 7.64 బిలియన్ డాలర్లు. ఇది భారత్ 79 బిలియన్ డాలర్ల బడ్జెట్ తో పోలిస్తే చాలా తక్కువ. యాంటీ మిసైల్ ట్యాంక్స్, రాకెట్ లాంచర్‌లు, ఇతర సాంప్రదాయ ఆయుధాలలో కూడా పాకిస్తాన్ వెనుకబడి ఉంది.
భారత్ వద్ద 3,975 ఆర్టిలరీ గన్స్
భారత్ వద్ద 3,975 ఆర్టిలరీ గన్స్ ఉండగా, పాకిస్తాన్ వద్ద 2,629 మాత్రమే ఉన్నాయి. భారత్ కు 2229 మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే.. పాకిస్తాన్ దగ్గర 1399 మాత్రమే ఉన్నాయి. అయితే న్యూక్లియర్ వార్ హెడ్ల్ విషయంలో పాక్ దగ్గర 170 ఉంటే, భారత్ దగ్గర 180 ఉన్నాయి. అయితే ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎక్విప్ మెంట్ సాధారణ సమయాల్లో వేరు చేసి ఉంటాయి. వీటిని అసెంబుల్ చేయాలంటే టైమ్ పడుతుంది. పాకిస్తాన్ రెచ్చిపోయే ఏకైక ప్రాంతం LOC. అక్కడ మాత్రమే తన ప్రతాపాన్ని చూపుతుంది. ఇప్పుడు ఆ పాక్ అవుట్ పోస్టులను కూడా భారత్ ఎలిమినేట్ చేస్తోంది.
కశ్మీర్ వివాదాన్ని శాశ్వత పరిష్కారమే లక్ష్యం
అణ్వాయుధాలైనా, యుద్ధమైనా.. భారత్ విధానం ఏంటంటే.. మొదట తనకు తాను ఏ దేశంపై దండెత్తొద్దు అని, నో ఫస్ట్ యూస్. దీని అర్థం. అదే పాకిస్తాన్ మాత్రం.. ఫస్ట్ స్ట్రైక్ పాలసీ ఫాలో అవుతోంది. కానీ చివరి పంచ్ మాత్రం మనదే. కశ్మీర్ వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించడం, సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ ను పూర్తిగా కట్టడం చేయడం, దక్షిణాసియాలో భారత్ ఆధిపత్యాన్ని బలోపేతం చేయడమే వ్యూహంగా ప్రస్తుతం భారత చర్యలు ఉండే అవకాశం ఉంది.