SRH VS CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Sunrisers Hyderabad vs Chennai Super Kings, 27th Match) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ( Rajiv Gandhi International Stadium, Hyderabad) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో వర్షం కూడా ప్రారంభమైంది. ఈ వర్షం ఉప్పల్ స్టేడియం ప్రాంతంలో కూడా పడే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి.
Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖరీదైనవా ? ఆ డబ్బులతో 4 SUV కార్లు కొనచ్చు
హైదరాబాద్ మహానగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ దంచి కొట్టగా.. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వర్షం షురూ అయింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు అలాగే మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. అమీర్ పేట్, జూబ్లీహిల్స్ అలాగే బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట, హయత్ నగర్, వనస్థలిపురం అటు ఉప్పల్ ప్రాంతంలో కూడా వర్షం కురుస్తున్నట్లు కలుస్తోంది.
స్టేడియం సమీపంలో ఉరుములు మెరుపులు చోటు చేసుకుంటున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఉప్పల్ స్టేడియంలో వర్షం పడడం లేదు కానీ.. ఏడున్నర గంటల ప్రాంతంలో పడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఒకవేళ అదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగే ఛాన్సులు తక్కువ అని అంటున్నారు. భారీ వర్షం పడితే మ్యాచ్ పూర్తిగా రద్దు అవుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతో టికెట్లు కొనుగోలు చేసి స్టేడియాలకు వెళ్లిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వర్షం పడకూడదని కోరుతున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కీలక మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కొత్త ప్లేయర్ రంగంలోకి దిగాడు. డేవిడ్ పేన్ స్థానంలో కొత్త పేసర్ వచ్చాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ ( Gerald Coetzee )ని రెండు కోట్లకు కొనుగోలు చేసింది కావ్య పాప. ఈ విషయాన్ని ఐపీఎల్ అలాగే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గతంలో ఈ గెరాల్డ్ కోయెట్జీ…. ముంబై అలాగే గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా తరఫున కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు గెరాల్డ్ కోయెట్జీ.