E-Paper
Advertisement

ZIM vs AUS : హిస్ట‌రీ రిపీట్.. ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే..!

ZIM vs AUS :  హిస్ట‌రీ రిపీట్.. ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే..!

ZIM vs Aus : టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సంచ‌ల‌నం న‌మోదు అయింది. ఆస్ట్రేలియా పై జింబాబ్వే జ‌ట్టు 23 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. క్రికెట్ లో ఎప్పుడూ ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం అనడానికి ఇది చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన‌వ‌చ్చు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జ‌ట్టు 169/ 2 స్కోర్ న‌మోదు చేసింది. ఆస్ట్రేలియా 19.3 ఓవ‌ర్ల‌లో 46 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.అయితే మాట్ రెన్షా (65) మిన‌హా అంద‌రూ  బ్యాట‌ర్లు విఫ‌లం చెందారు.  జింబాబ్వే బౌల‌ర్ల‌లో ముజార‌బానీ 4, బ్రాడ్ ఇవాన్స్ 3, విల్లింగ్ట‌న్, ర్యాన్ చెరో వికెట్ తీశారు. అయితే 2007లో జ‌రిగిన టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ లో సైతం జింబాబ్వే విజ‌యం సాధించింది. స‌రిగ్గా 19 ఏళ్ల త‌రువాత సేమ్ సీన్ రిపీట్ చేయ‌డం విశేషం.

Also Read : Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

అద్భుతం సృష్టించిన జింబాబ్వే..!

ఇవాళ కొలొంబోలోని ఆర్.ప్రేమ‌దాస స్టేడియంలో జ‌రిగిన ఐసీసీ పురుషుల టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 గ్రూపు బీ మ్యాచ్ లో జ‌రిగిన అద్భుతం గురించే అంద‌రూ చ‌ర్చించుకోవ‌డం విశేషం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఆచితూచి ఆడింది. ఓపెనర్లు బ్రైన్ బెన్నెట్, తడివనాశే మరుమని అద్భుతమైన పునాది వేశారు. మరుమని 21 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు చేసి మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ర్యాన్ బర్ల్ (35)తో కలిసి బ్రైన్ బెన్నెట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. బెన్నెట్ 56 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో కెప్టెన్ సికందర్ రజా 13 బంతుల్లోనే 25 పరుగులు చేసి స్కోరును 169కి చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టోయినిస్, గ్రీన్ చెరో వికెట్ తీశారు.

ఆస్ట్రేలియా ఓటమి..

ఇక 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. బ్లెస్సింగ్ ముజరబానీ తన తొలి ఓవర్‌లోనే ప్రమాదకరమైన జోష్ ఇంగ్లిస్‌ను (8) పెవిలియన్ పంపాడు. ఆ వెంటనే బ్రాడ్ ఎవాన్స్ తన అటాకింగ్‌తో కామెరాన్ గ్రీన్ (0)ను ఔట్ చేయగా, ముజరబానీ మళ్ళీ దాడి చేసి టిమ్ డేవిడ్‌ను సున్నాకే వెనక్కి పంపాడు. ట్రావిస్ హెడ్ (17) కూడా ఎవాన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అవ్వడంతో ఆస్ట్రేలియా 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కష్టాల్లో ఉన్న జట్టును మ్యాట్ రెన్షా (65), గ్లెన్ మాక్స్‌వెల్ (31) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించి ఆశలు చిగురింపజేశారు. అయితే, సికందర్ రజా కండరాల నొప్పితో మైదానం వీడిన సమయంలో బౌలింగ్‌కు వచ్చిన ర్యాన్ బర్ల్, మాక్స్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన రెన్షా 44 బంతుల్లో 65 పరుగులు చేసి ముజరబానీ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. స్టోయినిస్ (6) కూడా విఫలం కావడంతో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది.

Also Read : Usman Tariq: నా బౌలింగ్ త‌ల‌చుకుని అభిషేక్ శ‌ర్మ‌ వ‌ణికిపోయాడు..అందుకే ఆస్ప‌త్రిలో ప‌డ్డాడు

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×