E-Paper
Advertisement

Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

Ishan Kishan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ( Pakistan’s Usman Tariq) బౌలింగ్ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అతని ద్వారా ఇండియాను దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఉస్మాన్ తారిక్ ను ( Usman Tariq) టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం సిద్ధం చేశారు. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ శివరాత్రి రోజు జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై హాట్ కామెంట్స్ చేశాడు టీమిండియా డేంజర్ ఆటగాడు ఇషాన్ కిషన్ ( Ishan Kishan). అతడి బౌలింగ్ యాక్షన్ కు సంబంధించిన వీడియోలన్నీ చూస్తున్నాం.. ఉస్మాన్ తారిక్‌ టెక్నిక్స్ తెలుసుకున్నామ‌ని వెల్లడించారు. మ్యాచ్ లో కచ్చితంగా ఉస్మాన్ తారిక్ భరతం పడతామని వార్నింగ్ ఇచ్చాడు ఇషాన్ కిష‌న్‌. ఉస్మాన్ బౌలింగ్ సిక్సుల వ‌ర్షం కురిపిస్తామ‌ని హెచ్చ‌రించారు.

Also Read: Gerhard Erasmus Bowling Action: న‌మీబియాలో మ‌రో ఉస్మాన్ తారిక్‌..ఇండియాతో జ‌రిగిన‌ మ్యాచ్ లో ఎరాస్మ‌స్ త్రో బౌలింగ్

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15 అంటే శివరాత్రి రోజున ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. మొదట ఇండియా తో మ్యాచ్ ఆడబోమని డ్రామాలు చేసిన పాకిస్తాన్.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గట్టి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఒప్పుకుంది. దీంతో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలోని ప్రేమ దాస స్టేడియం వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ టీమిండియా కు పెను సవాల్ గా మారింది. అతడు ప్రతి మ్యాచ్ లో మిస్టరీ బౌలింగ్ చేసి వికెట్లు పడగొడుతున్నాడు.

అయితే ఉస్మాన్ ను ఎదుర్కోవడం ఇండియా వల్ల కాదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కొంటామో క్లారిటీ ఇచ్చాడు టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్. పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ను చాలా గమనించామని వెల్లడించారు. అతడి బౌలింగ్ చాలా కఠినంగా ఉంది.. కానీ మా యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ సిద్ధం చేసుకున్నాం. మ్యాచ్ జరిగిన సమయంలో దాన్ని అమలు చేస్తామని హెచ్చరించారు. కచ్చితంగా ఉస్మాన్ తారిక్ భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ అంటే ఇండియన్స్ ఎవరూ కూడా భయపడడం లేదు.. అతని సీక్రెట్స్ అన్ని తెలుసుకున్నాం… మ్యాచ్ సమయంలో సిక్స్ ల కురిపిస్తామని హెచ్చరించాడు ఇషాన్ కిషన్.

Also Read: T20 World Cup 2026: అరుణ్ జైట్లీ స్టేడియం ద‌గ్గ‌ర దారుణం…మిగిలిపోయిన డ్రింక్స్ రీ-యూజ్?, ఇండియా ప‌రువు తీస్తున్నారు క‌ద‌రా

 

Related News

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

Big Stories

×