E-Paper
Advertisement

Tim David Bowling : సునీల్ నరైన్ లాగా మారిపోయిన టిమ్ డేవిడ్.. బంతి దాచుకొని మరి బౌలింగ్

Tim David Bowling : సునీల్ నరైన్ లాగా మారిపోయిన టిమ్ డేవిడ్.. బంతి దాచుకొని మరి బౌలింగ్
Advertisement

Tim David Bowling : ఆస్ట్రేలియా క్రికెట‌ర్ టిమ్ డేవిడ్ బ్యాటింగ్ లో ఎంత‌టి విధ్వంసం సృష్టిస్తాడో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున కొన్ని కీల‌క ఇన్నింగ్స్ లు ఆడాడు. అలాగే గ‌తంలో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఐపీఎల్, ప్ర‌పంచ క్రికెట్ టీ-20 ఫార్మాట్ లో ఇప్ప‌టికే టిమ్ డేవిడ్ త‌న‌దైన మార్క్ తో చెల‌రేగుతూ అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్నాడు. తాజాగా అత‌ని బ్యాటింగ్ విధ్వంసం అబుదాబి టీ-10 లీగ్ లో కొన‌సాగుతోంది. ఇక ఈ టోర్నీలో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్.. ఫైన‌ల్ లో కూడా మెరుపులు మెరిపించి త‌న జ‌ట్టును గెలిపించాడు.

Also Read : Rohit Sharma: మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ రోహిత్ శర్మ మ‌తిమ‌రుపు..ఈ సారి న‌**గ్నంగా ఫోటోలు !

సునీల్ నరైన్ లాగా మారిపోయిన టిమ్ డేవిడ్

Advertisement

ఇక ఇదంతా ప‌క్క‌కు పెడితే ఈ మ్యాచ్ లో ఆసీస్ క్రికెట‌ర్ చేసిన ఓ ప‌ని చూస్తూ తెగ న‌వ్వు తెప్పిస్తోంది. అందేంటంటే..? అబుదాబి టీ-10 లీగ్ లో భాగంగా ఆస్పిన్ స్టాలియ‌న్స్, యూఏఈ బుల్స్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో యూఏఈ బుల్స్ త‌ర‌పున ఆడుతున్న డేవిడ్ త‌న స‌హ‌చ‌రుడు సునీల్ న‌రైన్ బౌలింగ్ యాక్ష‌న్ తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అచ్చం న‌రైన్ ను అచ్చు గుద్దిన‌ట్టే టిమ్ డేవిడ్ బౌలింగ్ చేయ‌డం విశేషం. అప్ప‌టికే యూఏఈ బుల్స్ విజ‌యం ఖ‌రారు కావ‌డంతో డేవిడ్ చివ‌రి ఓవ‌ర్ వేశాడు. ఈ ఓవ‌ర్ లో కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టిమ్ డేవిడ్ బ‌లింగ్ చూసి పోలార్డ్ అయితే తెగ న‌వ్వుకున్నాడు. న‌రైన్ అయితే డేవిడ్ చేసిన బౌలింగ్ చూసి షాక్ కి గుర‌య్యాడు. ఇక న‌రైన్ ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్ అయితే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

ఏక‌ప‌క్షంగా ఫైన‌ల్ మ్యాచ్ 

ఏక‌ప‌క్షంగా జ‌రిగిన ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో యూఏఈ బుల్స్ 80 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించి టైటిల్ గెలుచుకుంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన యూఏఈ బుల్స్ నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 150 ప‌రుగులు చేసింది. టిమ్ డేవిడ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 30 బంతుల్లో 98 ప‌రుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఛేజింగ్ లో ఆస్పిన్ స్టాలియ‌న్స్ 10 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 70 ప‌రుగులు మాత్ర‌మే చేసి 80 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. టిమ్ డేవిడ్ కి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.  యూఏఈ బుల్స్ జట్టుకు దారుణమైన ఆరంభం లభించింది. జేమ్స్ విన్స్ కేవలం రెండు బంతులకే రిటైర్ హార్ట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ వేగంగా ఆడినప్పటికీ.. ఎనిమిది బంతుల్లోనే 18 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చి విధ్వంసం సృష్టించాడు.

Advertisement

Also Read : Mrunal Thakur: హీరోతో పెళ్లి, క్రికెట‌ర్ తో ఎఫైర్‌..మృణాల్ ఠాకూర్ అదిరిపోయే రియాక్ష‌న్ !

?igsh=Y3g4NmFiaWdvbjR3

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×