kohli – Anaya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) పునః ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో… సంజయ్ బంగర్ కూతురు అనయ బంగర్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. నిత్యం ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కాకుండా పలు ఇంటర్వ్యూలో పాల్గొని… షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే సంజయ్ బంగర్ కూతురు.. అనయ బంగర్ ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయింది.
విరాట్ కోహ్లీ తో క్రికెట్ ఆడిన అనయ బంగర్
అమ్మాయిగా మారిన తర్వాత అనయ బంగర్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడమే కాకుండా.. పుకార్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాల్గొన్న అనయ బంగర్ ( anaya bangar )… విరాట్ కోహ్లీ (VIRAT KOHLI) గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల టెస్టులకు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ గురించి… మీకు తెలిసిన విషయాలు చెప్పండి అని అనయ బంగర్ ను యాంకర్ అడిగారు. దీంతో తన మనసులో ఉన్న మాటలన్నీ బయట పెట్టింది అనయ బంగర్. anaya bangar kohli
విరాట్ కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టమని… అలాంటి ప్లేయర్ను మళ్ళీ… మనం సాధించడం చాలా కష్టమని వెల్లడించారు. టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం కావడం అందరికీ బాధగా ఉందని పేర్కొన్నారు అనయ బంగర్. అయితే గతంలో తన తండ్రి ని కలిసేందుకు విరాట్ కోహ్లీ వచ్చేవాడని వివరించారు అనయ బంగర్. అప్పుడు విరాట్ కోహ్లీ నుంచి చాలా టిప్స్ తాను తెలుసుకున్నానని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీతో కలిసి క్రికెట్ కూడా ఆడినట్లు గుర్తు చేశారు.
అలాగే తనకు చాలా హెల్త్ టిప్స్ కూడా విరాట్ కోహ్లీ చెప్పినట్లు వెల్లడించారు అనయ బంగర్. ప్రెషర్ లో ఉన్నప్పుడు ఎలా క్రికెట్ ఆడాలి ? సులభమైన మ్యాచ్లో మనం ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాలను కూడా తనకు విరాట్ కోహ్లీ చెప్పినట్లు గుర్తు చేసుకుంది అనయ బంగర్. తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని.. కానీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తనను క్రికెట్ ఆడనివ్వడం లేదని ఎమోషనల్ అయింది.
ఆ క్రికెటర్ పక్కలోకి రమ్మన్నాడు
టీమిండియా కు సంబంధించిన ఓ సీనియర్ క్రికెటర్ తనను పక్కలోకి రమ్మన్నాడని షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది అనయ బంగర్. తన పక్కలోకి వస్తే క్రికెట్ గురించి అన్ని చెబుతానని అతడు చెప్పినట్లు పేర్కొంది. అలాగే కొంత మంది క్రికెటర్లు కూడా తన ప్రైవేట్ పార్ట్స్ ఉన్న ఫోటోలను కూడా షేర్ చేయమని టార్చర్ పెట్టినట్లు అప్పట్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా విరాట్ కోహ్లీ గురించి కామెంట్స్ చేసి అనయ బంగర్ హాట్ టాపిక్ అయ్యారు.