Actress Jayalalitha : తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు నటీనటులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందం, అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటారు. ఇప్పుడు మనం యాక్టర్ జయలలిత గురించి తెలుసుకుందాం.. హీరోయిన్ మెటీరియల్ కానీ కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది. ఈమె ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్ని ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును అందించాయి. ప్రస్తుతం సినిమాలే కాదు సీరియల్స్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. ఈమె జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
జయలలిత సినిమాలు..
తెలుగు నటి జయలలిత గురించి అందరికి తెలిసే ఉంటుంది. తన నటనతో మాత్రమే కాదు. ఈమె ఒక డ్యాన్సర్ కూడా.. శృంగార, హాస్య పాత్రలను ఎక్కువగా పోషిస్తుంటుంది. జాతీయ పురస్కారం పొందిన గ్రహణం చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమ్మమ్మ డాట్ కామ్ అనే ధారావాహికలో కూడా నటించింది.. సినిమా లైఫ్ సాఫిగా సాగిపోతుంది. ఈ క్రమంలో ప్రేమించి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అదే ఆమె జీవితానికి శాపంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త టార్చర్ చేస్తుంటే అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో కీలక విషయాలను బయటపెట్టింది.
ఆయనతో చాలా డీప్ గా వెళ్లాను..
తాజాగా ఓ ఇంటర్వూలో ఈమె మాట్లాడుతూ.. నటుడు శరత్ బాబును తాను ప్రేమించానని నటి జయలలిత అన్నారు. ఇద్దరం కలిసి బిడ్డను కనాలనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన్ను నేను బావా అని పిలిచేదాన్ని అని ,కలిసి ఎన్నో యాత్రలు చేశాం అని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడాయన లేరు కాబట్టి చెబుతున్నా. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. బిడ్డను కనాలనుకున్నాం అని ఇండస్ట్రీ వాళ్లే ఆపేశారు. అయితే నాకు అన్నీ ఆయనే చాలా డీప్ గా వెళ్ళాము.. ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు. నా జీవితం ఆయనకే అంకితం అని ఆమె అన్నారు. చాలా మంది మగాళ్లు నన్ను ఇబ్బంది పెట్టారు. ఒక డైరెక్టర్ నేను వెళ్లినందుకు సినిమా లోంచి తీసేసాడు.
ఇలా ఒక్కరు కాదు చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. ఒక మలయాళ డైరెక్టర్ రేప్ సీన్ గురించి చెప్పాలని తీసుకెళ్లాడు. అక్కడ నన్ను రేప్ చేశాడు. అలా నేను అనేక సార్లు లొంగిపోయాను అని ఆమె కన్నీళ్లు తెప్పించే విషయాలను బయటపెట్టింది. ఇక సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన ఆమె ఇటీవల బుల్లితెరపై ధారావాహికల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. బుల్లితెరపైనే కాన్సంట్రేట్ చేసిన ఆమె బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి తదితర సీరియల్స్ చేశారు.. సుమారు 650కి పైగా సినిమాలు చేసిన జయలలిత ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో తెగ వైరల్ అవుతుంది.