Navnita Gautam: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 30% మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల ఆధారంగా పంజాబ్ కింగ్స్ టాప్ లో ఉంది. ఆ తర్వాత బెంగుళూరు ఉండగా, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరివాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీకు మసాజ్ చేసిన ఓ మిస్టరీ లేడీ ఫోటో వైరల్ గా మారింది. దీంతో ఆమె ఎవరు అని అందరు సెర్చ్ చేస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీకి ( Virat Kohli) మసాజ్ ( Massage) చేసింది నవనీత గౌతమ్ ( Navnita Gautam). రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ( Royal Challengers Bangalore ) అథ్లెటిక్ తెరపిస్టుగా ఆమె పనిచేస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీకి గాయమైన నేపథ్యంలో ఆమెని దగ్గరుండి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖరీదైనవా ? ఆ డబ్బులతో 4 SUV కార్లు కొనచ్చు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన విరాట్ కోహ్లీ ఇటీవల గాయం బారిన పడ్డాడు. ఈ తరుణంలో విరాట్ కోహ్లీకి మసాజ్ చేసింది ఈ మిస్టరీ లేడీ నవనీత గౌతమ్ ( Navnita Gautam). ఈమె బెంగళూరు జట్టులో అథ్లెటిక్ థెరపిస్ట్. కెనడాలో శిక్షణ పొందిన నవనీత గౌతమ్… సర్టిఫైడ్ అథ్లెటిక్ థెరపిస్టుగా పేరు గాంచారు. ముఖ్యంగా ఫిజియోథెరపీలో ఆమె నిపుణురాలు అని నివేదికలు చెబుతున్నాయి. 2019లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అథ్లెటిక్ థెరపిస్టుగా నవనీత గౌతమ్ ను నియామకం చేసింది యాజమాన్యం.
దీంతో ఐపీఎల్ చరిత్రలో సపోర్టు స్టాఫ్ లో చేరిన తొలి మహిళగా నవనీత గౌతమ్ రికార్డు కూడా సృష్టించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ప్లేయర్లు గాయాల పాలు అవుతే… వాళ్లందరికీ ట్రీట్మెంట్ ఇచ్చేది ఈమెనే. గాయాల బారిన పడ్డ ప్లేయర్లను దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నవనీత గౌతమ్ దే. ప్లేయర్ లందరినీ ఫిట్ గా తయారు చేయడం ఈమె డ్యూటీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కంటే ముందు గ్లోబల్ టీ20 కెనడా లీగ్, ఆసియా అలాగే యూరోపియన్ గోల్ఫ్ టూర్లలో కూడా పనిచేసిన అనుభవం నవనీత గౌతమ్ కి ఉంది. ఈమె స్వస్థలం కెనడా. అక్కడే పుట్టి పెరిగి, ఇప్పుడు బెంగళూరు జట్టుకు పని చేస్తోంది.
గత వారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. చీలమండ గాయంతో ఇంపాక్ట్ ప్లేయర్ గా మారిపోయాడు కోహ్లీ. అయితే అతనికి దగ్గరుండి ట్రీట్మెంట్ అందించింది నవనీత గౌతమ్. టైం టు టైం ఫిజియోథెరపీ చేసి, గాయం నుంచి విరాట్ కోహ్లీ బయటపడేలా చేసింది. దీంతో ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.
Also Read: SRH జట్టులో చీలిక.. తెలంగాణ, ఏపీ ఫ్యాన్స్ మధ్య కొత్త పంచాయితీ..తలపట్టుకున్న కావ్య పాప
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==