E-Paper
Advertisement

Virat Kohli:- వావ్ విరాట్ వావ్.. కొహ్లీ వెంట పరిగెడుతున్న రికార్డులు

Virat Kohli:- వావ్ విరాట్ వావ్.. కొహ్లీ వెంట పరిగెడుతున్న రికార్డులు
Advertisement

Virat Kohli:- ఐపీఎల్‌లో వంద ’30 ప్లస్‌’ స్కోర్లు చేసిన ఏకైక ఆటగాడు కొహ్లీ. ఇలాంటి అరుదైన ఫీట్ అందుకున్న విరాట్ కొహ్లీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. The Man, The Myth, The Legend అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ ఫీట్ అందుకున్నారు విరాట్. పైగా ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గ వ్యవహరించాడు కొహ్లీ.

కొహ్లీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 600 ఫోర్లు కొట్టిన‌ మూడో క్రికెట‌ర్‌గా రికార్డ్ సృష్టించాడు. మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ 5 బౌండ‌రీలు కొట్టాడు. దాంతో, 600 ఫోర్లు కొట్టిన క్ల‌బ్‌లో చేరాడు.

Advertisement

కోహ్లీ మొత్తం 229 మ్యాచుల్లో 603 బౌండ‌రీలు సాధించాడు. విశేషం ఏంటంటే ఫోర్లు కొట్టడంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌ శిఖ‌ర్ ధావ‌నే. ఇప్పుడు ఆ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లోనే విరాట్ కొహ్లీ ఈ ఫీట్ సాధించాడు. శిఖర్ ధావన్ మొత్తం 730 ఫోర్లు కొట్టి అగ్ర‌స్థానంలో ఉన్నాడు. పైగా గ‌బ్బ‌ర్ 210 మ్యాచుల్లోనే ఈ ఫీట్‌ సాధించాడు. ఐపీఎల్ పరుగులలోనూ శిఖర్ ది రికార్డే. ఫస్ట్ ప్లేస్‌లో విరాట్ కొహ్లీ ఉంటే.. రెండో ప్లేస్ గబ్బర్‌దే. ఇప్పుడు ఫోర్లు బాదడంలోనూ గబ్బరే ఫస్ట్. పైగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కూడా. కాని, విరాట్ కొహ్లీకి వచ్చినంత క్రేజ్.. పాపం శిఖర్ ధావన్‌కు రాలేదు. ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ 608 ఫోర్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×