BigTV English

Riyan Parag:- ఐటమ్ అన్న వాడు.. రియాన్ పరాగ్‌పై నెటిజన్ల ఫైర్

Riyan Parag:- ఐటమ్ అన్న వాడు.. రియాన్ పరాగ్‌పై నెటిజన్ల ఫైర్

Riyan Parag:- నెపోటిజం. క్రికెట్లోనూ జరుగుతుందనడానికి రియాగ్ పరాగే పెద్ద ఎగ్జాంపుల్. రియాన్‌ అంకుల్‌కు సెలక్షన్‌ మెంబర్‌తో దోస్తీ ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని జట్టులో ఉండగలుగుతున్నాడు. లేదంటే, డ్రింక్స్ సప్లై చేసేందుకు కూడా పనికి రాడంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.


పేరుకు మాత్రమే ఆల్ రౌండర్. పర్ఫామెన్స్‌లో మాత్రం వెరీ పూర్. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన రియాన్ పరాగ్.. 54 పరుగులు మాత్రమే చేశాడు. అంటే మ్యాచ్‌కు 13 పరుగులు. ఈ మాత్రానికి 3 కోట్లు పెట్టి కొనాలా అంటూ ఫైర్ అవుతున్నారు. కనీసం ఈ ఐదు మ్యాచుల పర్ఫామెన్స్ చూసైనా.. అతన్ని తీసేయండని డైరెక్టుగా చెబుతున్నారు.

రియాన్‌ పరాగ్‌ తన ఆట కంటే మైదానంలో విచిత్ర చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. ప్రత్యర్థి బ్యాటర్లు ఔట్ అయినప్పుడు వెకిలిగా వ్యవహరించడం.. తనను జట్టు నుంచి తీసివేసే దమ్ము ఎవరికీ లేదన్నట్లు ప్రవర్తించడం రియాన్‌కు మాత్రమే చెల్లింది. అందుకే, ఆట తక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అంటూ నెటిజన్స్ ఎన్నో రీతుల్లో కామెంట్స్ పెడుతున్నారు.


ఇదే సమయంలో అర్జున్ టెండూల్కర్‌ను చూసి నేర్చుకోండంటూ కామెంట్స్ చేస్తున్నారు. సచిన్‌ టెండుల్కర్‌ ఒక్క మాట చెబితే..  ముంబై ఇండియన్స్‌ తరపున ఎప్పుడో ఆడేవాడు. కాని, 2-3ఏళ్ల పాటు బెంచ్‌ మీదే ఉన్నాడు. అదే రియాన్ పరాగ్.. 2019 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ఏ ఒక్క సీజన్‌లోనూ పొడిచిందేమీ లేకపోయినా.. వరుసగా ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. ఓవైపు టాప్‌ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ ఉన్నా కూడా రియాన్‌ను బ్యాటింగ్‌కు పంపించారంటే.. రాజస్థాన్‌ రాయల్స్‌‌పై రియాన్ పరాగ్ ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఐదు సీజన్లలో కలిపి 4 వికెట్లు తీశాడంటే.. ఎంత గొప్ప బౌలరో.

అందుకే, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ – రియాన్‌ పరాగ్.. మోస్ట్‌ ఇరిటేటింగ్‌ ప్లేయర్ ఆఫ్ ఐపీఎల్‌ హిస్టరీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×