BigTV English

Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

 


Yuvraj Singh Makes SHOCKING Claim About Actress He Dated During 2007 India-Aus Tour: అంతర్జాతీయ క్రికెట్ లోనే యువరాజ్ సింగ్ గురించి తెలియని వారుండరు. ఆడినంత కాలం తన అభిమానులు కాలర్ ఎగిరేసుకొని గర్వంగా చెప్పుకునేలా అద్భుతాలు సృష్టించాడు. తన ఆట తీరుతో హైలైట్ గా నిలిచేవాడు. బ్యాట్, బాల్ తో మ్యాజిక్ లో చేస్తూ అభిమానుల మనసులను దోచుకున్నాడు. టీమిండియా రెండుసార్లు వరల్డ్ కప్ ను గెలవడంలో కీలకపాత్ర పోషించాడు యువరాజ్ సింగ్. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాలలో యువరాజ్ సింగ్ తనదైన ముద్ర వేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన సీన్ ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. ఆటలోనే కాకుండా ఆఫ్ ది ఫీల్డ్ లోనూ యువరాజ్ సింగ్ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటాడు.

స్టైలిష్ క్రికెటర్ అనే పేరును కూడా సంపాదించుకున్నాడు. ఇతడికి లవ్ ట్రాక్ లు కూడా ఎక్కువగానే ఉన్నాయనే టాక్ జోరుగానే వినిపిస్తూ ఉంటుంది. తాజాగా యూవీ 16, 17 సంవత్సరాల క్రితం నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. 2007, 2008లో ఆస్ట్రేలియా పర్యటన నాటి జ్ఞాపకాలను తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అప్పట్లో యువీ ఓ హీరోయిన్ తో డేటింగ్ చేశాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు ఆ హీరోయిన్ మంచి పోసిషన్ లో ఉండేదని, తాను ఆసిస్ ఉండగానే ఆడి లైడ్ కు షూటింగ్ కు వచ్చిందని చెప్పాడు. అప్పుడు అతను కాన్ బెర్రా లో ఉన్నానని గుర్తు చేసుకున్నాడు.


అయితే ఆ హీరోయిన్ ను అక్కడికి రావద్దని సూచించానని…. కీలకమైన సిరీస్ కావడంతో తన పూర్తి ధ్యాస అంతా ఆట మీదే ఉండాలని, అందుకే తనను రావద్దని చెప్పానని చెప్పుకొచ్చాడు. ఆసిస్ తో టెస్ట్ సిరీస్ అంటే మాటలు కాదు. అయితే ఆ హీరోయిన్ మాత్రం నా మాట వినకుండా కాన్ బెర్రాకు వచ్చింది. అప్పటికే ఆసీస్ తో ఆడిన రెండు టెస్టుల్లో నేను పరుగులు పెద్దగా చేయలేకపోయానని, ఆ అమ్మాయిని చూడగానే నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని ప్రశ్నించాను. దీంతో ఆ హీరోయిన్ నీతో సమయం గడపాలని ఇక్కడికి వచ్చానని చెప్పింది. దాంతో ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేశాను. కెరియర్ పైనే ఫోకస్ పెడదామని సలహా ఇచ్చాను. ఉదయం కాన్ బెర్రా నుంచి ఆడిలైడ్ కు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు నా లగేజ్ ఆ అమ్మాయి సర్దేసింది.

Also Read: Ind vs Ban: మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా… కాన్పూర్ లో భారీ వర్షం.. మ్యాచ్ జరగడం కష్టమే?

కాకపోతే నా షూస్ అందులో కనిపించలేదు. షూస్ ఎక్కడ అని అడిగితే బ్యాగులోనే ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు నేను ఎలా వెళ్లాలి షూస్ లేవు అని అడిగితే పింక్ కలర్ స్లిప్పర్స్ ఇచ్చింది. స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళు అని చెప్పింది. నేను అవే స్లిప్పర్స్ వేసుకొని వెళ్లాను. లగేజ్ తో స్లిప్పర్స్ ను కవర్ చేసే ప్రయత్నం చేశాను. కానీ నా తోటి ఆటగాళ్లు వాటిని చూశారు. నన్ను ఆట పట్టించారు. వేరేవి కొనుగోలు చేసే వరకు పింక్ స్లిప్పర్స్ తోనే ప్రయాణం చేశానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరోయిన్ ఎవరు అనే విషయాలు మాత్రం అసలు వెల్లడించలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని అభిమానులు ఆలోచనలో పడుతున్నారు. అయినా యువరాజ్ సింగ్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. లవ్ ట్రాక్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయని సరదాగా మాట్లాడుకుంటున్నారు.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×