BigTV English

Ind vs Ban: మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా… కాన్పూర్ లో భారీ వర్షం.. మ్యాచ్ జరగడం కష్టమే?

Ind vs Ban: మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా… కాన్పూర్ లో భారీ వర్షం.. మ్యాచ్ జరగడం కష్టమే?

Unchanged India bowl in Kanpur two changes for Bangladesh: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఉదయమే ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభం అయింది. వాస్తవంగా ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కాన్పూర్ లో ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియం తడిసి ముద్దయింది. అందుకే టాస్ ప్రక్రియను కూడా ఆలస్యంగా.. వేయడం జరిగింది.


మ్యాచ్ ప్రారంభం కంటే.. ముందు వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే పిచ్చి తడిగా ఉండడంతో దాన్ని ఆరబెట్టారు. అక్కడ ఉన్న సిబ్బంది పిచ్ ను రెడీ చేసేందుకు గంటసేపు పట్టింది. ఇక ఆ తర్వాత 10 గంటలకు టాస్ ప్రక్రియ జరిగింది. దీంతో 10:30 నుంచి బంగ్లాదేశ్ బ్యాటింగ్కు దిగింది. మొదట బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. మొదటి టెస్ట్ లాగా… తడబడుతోంది. ఇప్పటికే ఒక వికెట్ కూడా నష్టపోయింది బంగ్లాదేశ్.

Also Read: IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?


ఇక అటు… ముగ్గురు స్పిన్నర్లతో ఈ మ్యాచ్లో బరిలో దిగుతుంది అనుకున్న టీం ఇండియా…ముగ్గురు సీమర్లతోనే వచ్చేసింది. ఎలాంటి మార్పులు చేయకుండా రెండవ టెస్టు ఆడుతోంది రోహిత్ సేన. అయితే… కాన్పూర్ లో రేపు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందట. ఇవాళ సాయంత్రం నుంచే అక్కడ వాతావరణం చల్లబడి వర్షం పడే ఛాన్స్ కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రెండవ టెస్టు పూర్తిగా ఆడే అవకాశాలు లేవని అంటున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ డ్రాగ ముగిసే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Read Also: Ind Vs Ban: గంభీర్‌ భారీ స్కెచ్‌…రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్..బంగ్లాకు ఇక చుక్కలే ?​

భారత్: 1 రోహిత్ శర్మ (కెప్టెన్), 2 యశస్వి జైస్వాల్, 3 శుభమన్ గిల్, 4 విరాట్ కోహ్లీ, 5 రిషబ్ పంత్ (WK), 6 KL రాహుల్, 7 రవీంద్ర జడేజా, 8 ఆర్ అశ్విన్, 9 ఆకాష్ దీప్, 10 జస్ప్రీత్ బుమ్రా, 11 మహ్మద్ సిరాజ్

బంగ్లాదేశ్: 1 షాద్మాన్ ఇస్లాం, 2 జకీర్ హసన్, 3 నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), 4 మోమినుల్ హక్, 5 ముష్ఫికర్ రహీమ్, 6 షకీబ్ అల్ హసన్, 7 లిట్టన్ దాస్ (WK), 8 మెహిదీ హసన్ మిరాజ్, 9 తైజుల్ ఇస్లాం, 10 హసన్ మహమూద్ , 11 ఖలీద్ అహ్మద్

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×