BigTV English

Drugs Case News: కేపీ చౌదరితో డ్రగ్ లింక్స్.. అషురెడ్డి, సిక్కిరెడ్డి రియాక్షన్స్..

Drugs Case News: కేపీ చౌదరితో డ్రగ్ లింక్స్.. అషురెడ్డి, సిక్కిరెడ్డి రియాక్షన్స్..

Drugs case latest news(Tollywood celebrity news): కేపీ చౌదరి డ్రగ్స్ దందా ప్రకంపణలు రేపుతోంది. నిందితుడి కాల్ లిస్ట్‌ నుంచి ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. అందులో ఆషురెడ్డి అందరికీ వెల్ నోన్. మరో ఇద్దరు హీరోయిన్స్‌తోనూ కేపీ చౌదరి.. ఫుల్‌గా కాంటాక్ట్‌లో ఉన్నట్టు కనుగొన్నారు. ఓ 12 మందికి డ్రగ్స్‌తో లింకులు ఉన్నాయని గుర్తించారు. ఇంకా అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు కేపీ ఫోన్‌లో దాగున్నాయి.


తనపై వస్తున్న ఆరోపణలపై బిగ్ బాస్ కంటెస్టెంట్ అషురెడ్డి స్పందించారు. కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో తన పేరు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. తనకెలాంటి డ్రగ్ డీలర్స్ తో సంబంధం లేదని.. నిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. తన ఫోన్ నెంబర్ ను బహిర్గతం చేస్తే క్షమించేది లేదన్నారు. ప్రతీ దానికి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదన్న అషురెడ్డి.. సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు.

మరోవైపు, కేపీ చౌదరి తాను సిక్కిరెడ్డి ఇంట్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టు పోలీసులకు చెప్పడం కలకలంగా మారింది. సిక్కిరెడ్డి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆమె ఇంట్లో డ్రగ్స్ పార్టీ చేస్తుండగానే పోలీసులకు రైడ్ చేసి.. కేపీ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, సిక్కిరెడ్డి వాదన మరోలా ఉంది. కేపీ అరెస్ట్ సమయంలో తాను ఇండియాలోనే లేనని అంటోంది. పాత పరిచయంతోనే కేపీ చౌదరికి తన ఫ్లాట్ కీస్ ఇచ్చానని.. తనకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది.


అటు, కేపి చౌదరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈ నగరానికి ఏమైంది? హీరో సుశాంత్ రెడ్డి పేరు కూడా ఉంది. కేపీ చౌదరి నిర్మాతగానే తనకు తెలుసన్నారు సుశాంత్ రెడ్డి. గతంలో అతన్ని కొన్నిసార్లు కలిశానని, కాల్స్ మాట్లాడానని.. అయితే మూడేళ్లుగా కేపీని తాను కలవలేదంటూ క్లారిటీ ఇస్తున్నారు ఆ హీరో. తనకు డ్రగ్స్ అలవాటు లేదని.. డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని.. ఎలాంటి టెస్టులకైనా సిద్ధమని అంటున్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×