BigTV English

Banana price increase : సెంచరీకి చేరువలో అరటిపండు.. శ్రావణంలో అంతకుమించి..

Banana price increase : సెంచరీకి చేరువలో అరటిపండు.. శ్రావణంలో అంతకుమించి..
Banana latest price

Banana latest price(Telugu news updates):

నిన్నటి వరకూ టమాటా ధర ఠారెత్తించింది. కిలో డబుల్ సెంచరీ చేసేసి కిరాక్ లేపింది. వారాల తరబడి పైపైనే ఉంది. ఇప్పుడిప్పుడే వందకు అటూఇటూగా అమ్ముతున్నారు. హమ్మయ్య.. అనుకునేలోగా.. టమోటాకు పోటీనా అన్నట్టుగా.. అరటిపండ్ల రేట్ అమాంతం పెరిగిపోతోంది. సూపర్‌మార్కెట్లో కిలో రూ.100 కొంచెం తక్కువ. రేపేమాపో వంద టచ్ చేయడం ఖాయమంటున్నారు. బండ్లపైనా అరటిపండ్ల రేటు ఎక్కువే చెబుతున్నారు.


ఇటీవల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వానలకు అరటి తోటలు బాగా పాడైపోయాయి. అసలే బలం తక్కువ.. గట్టిగా గాలి వీస్తే అరటిచెట్టు పడిపోతుంది. అలాంటిది వరుసబెట్టి రోజుల తరబడి భారీ వానలు పడటంతో.. అరటి దిగుబడి బాగా తగ్గిపోయిందని అంటున్నారు. ఇంకేం. దిగుబడి లేకపోవడంతో.. ధర పెరిగిపోయింది.

గురువారం నుంచి శ్రావణమాసం కూడా ప్రారంభం కానుంది. శ్రావణమాసం అంటేనే పండుగలు, గుడులు, పూజలు, వ్రతాలు, శుభకార్యాలు. ప్రతీ శుక్రవారం వరలక్ష్మీ వత్రం. ఇక ఊరూరా వినాయక చవితి ఉండనే ఉంది. ఆ తర్వాత దసరా, దీపావళి. ఏ కార్యక్రమమైనా.. అరటిపండ్లు ఉండాల్సిందే. డిమాండ్ మేర ఉత్పత్తి లేకపోవడంతో.. ముందుముందు బనానా రేట్లపై బాదుడే బాదుడు అంటున్నారు. త్వరలోనే డజన్ అరటిపండ్ల ధర.. వంద దాటేస్తుందని చెబుతున్నారు. ఇక ఇప్పట్లో తగ్గే ఛాన్సే లేదంటున్నారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×