BigTV English

VYOOHAM MOVIE : వ్యూహం సెకండ్ టీజర్.. ఆ సీన్స్ తో పొలిటికల్ హీట్..

VYOOHAM MOVIE : వ్యూహం సెకండ్ టీజర్.. ఆ సీన్స్ తో పొలిటికల్ హీట్..

VYOOHAM MOVIE : ఏపీ రాజకీయాలపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా వ్యూహం. జగన్ రాజకీయ జీవితంపై వర్మ ఈ సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ తొలి టీజర్ పెను ప్రకంపనలు రేపింది. రాజశేఖర్ రెడ్డి మరణం, సీఎంగా రోశయ్య పదవి చేపట్టడం , జగన్ పాత్ర పరిచయంతో జూన్‌ 24న తొలి టీజర్ వదిలి ప్రకంపనలు రేపారు. ఈ టీజర్‌లో 2009 నుంచి 2014 వరకు జగన్ రాజకీయ జీవితంలో ఏం జరిగిందో చూపించారు. 50 రోజుల తర్వాత వర్మ.. వ్యూహం మూవీ రెండో టీజర్‌ను రిలీజ్ చేసి ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచారు.


వ్యూహం రెండో టీజర్ ఏపీలో పొటిలిటికల్ గా పెనుదుమారం రేపేలా ఉంది. ఈ టీజర్ ద్వారా సినిమా ఎలా ఉంటుందో వర్మ పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. ఓ హోటల్ లో చంద్రబాబు పాత్ర సీరియస్ డిస్కసన్స్ చేసే సీన్ ఆసక్తిని రేపుతోంది.

ఈ టీజర్ లో జగన్ ను సీబీఐ ఇంటరాగేషన్ చేసే సీన్ , వైసీపీ కార్యకర్తల ఆందోళన చేసే దృశ్యాలు ఉన్నాయి. నెక్ట్స్ సీన్ లో చంద్రబాబు పాత్ర మీసాలు కత్తిరించుకుంటూ కనిపిస్తుంది.


మెగాస్టార్ చిరంజీవి పాత్ర వ్యూహంలో ఉండటం కలకలం రేపుతోంది. పవన్ పాత్ర స్నూకర్ ఆడుతూ కనిపిస్తుంది. జగన్ పాత్ర ఓ నాయకుడిపై ఫైల్స్ విసురుకొట్టే సీన్ ఆస్తక్తిని రేపుతోంది. సీబీఐ ఇంటరాగేషన్ కొనసాగడం చూపించారు. నిజం షూ లేస్ కట్టుకునే లోపే అబద్ధం ప్రపంచమంతా ఓ రౌండ్ వేసి వస్తుందని అనే డైలాగ్ జగన్ పాత్ర చెప్పడం ఆసక్తిగా ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రలు సోఫాలో కుర్చుకుని చర్చించుకునే సీన్ తో తాజా పాలిటిక్స్ ను వర్మ చూపించాడు.

సోనియా పాత్ర ద్వారా రాష్ట్ర విభజన అంశాన్ని టచ్ చేశారు. రాష్ట్ర విభజనా.. అంటూ జగన్ అనగానే.. సోనియా పాత్ర చపాతీని రెండు ముక్కలుగా చింపేసే సీన్ పెట్టి టీజర్ లోనే వర్మ సినిమాపై ఉత్కంఠ పెంచేశారు. ఆ తర్వాత జగన్ పాత్ర అరెస్ట్ సీన్ ఉంది. రాష్ట్ర విభజనతో నిష్టూర్పు పడినట్లు చంద్రబాబు పాత్ర హావభావాలున్నాయి. మెగాస్టార్ ఇంట్లో జనసేన ఏర్పాటుపై చిరంజీవి, పవన్ చర్చిస్తున్నట్లు చూపించారు. ఆ డిస్కసస్ లో అల్లు అరవింద్ పాత్ర చప్పట్లు కొట్టే సీన్ పెట్టారు. ఈ ఎపిసోడ్ లో నాగబాబు పాత్ర కనిపించడం ఆసక్తిగా ఉంది.

టీజర్ చివరిలో వర్మ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఎప్పుడోకప్పుడు కల్యాణ్ ను కూడా మీరు వెన్నుపోటు పొడుస్తారు కదా అని బ్యాగ్రౌండ్ లో ఓ వ్యక్తి చంద్రబాబు పాత్రతో మాట్లాడతాడు. వాడికి అంతసీన్ లేదు .. తనను తానే పొడుచుకుంటాడు అని చంద్రబాబు పాత్ర సెటైర్ వేస్తుంది. ఇలా టీజర్ లోనే సినిమా చూపించి ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేశారు వర్మ.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×