BigTV English

Big TV on Manipur Issue: వారెవా బిగ్ టీవీ.. మణిపూర్‌లో బిగ్ రిపోర్టింగ్.. నెవ్వర్ బిఫోర్

Big TV on Manipur Issue: వారెవా బిగ్ టీవీ.. మణిపూర్‌లో బిగ్ రిపోర్టింగ్.. నెవ్వర్ బిఫోర్
Big TV on Manipur Issue

Big TV on Manipur Issue(Live tv news telugu):

తుపాకుల నీఘా నీడలో ప్రయాణం.. అడుగడుగునా అనుమానపు చూపులే.. ఎప్పుడు ఎటు నుంచి బుల్లెట్ దూసుకొస్తుందో తెలియని పరిస్థితి. అడుగు ముందుకు వేయొద్దంటూ ఆర్మీ హెచ్చరికలు.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ స్థానికుల వార్నింగ్‌లు. అయినా బిగ్ టీవీ అదరలేదు..బెదరలేదు. అడుగు ముందుకే వేసింది. మణిపూర్‌ గుండె చప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ రెండు వర్గాల గుండె ఆవేదనను దేశం మొత్తానికి వినిపించే ప్రయత్నం చేసింది. తగలబడిపోయిన ఇళ్లను చూపిస్తూ.. కన్నీళ్లు ఇంకిపోయిన మణిపూర్ ప్రజల మనోవేదనను తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ.


జాతుల మధ్య వైరంతో మండిపోతున్న మణిపూర్‌లో బిగ్‌ టీవీ బిగ్‌ సాహసం చేస్తోంది. ప్రాణాలకు తెగించి బిగ్‌ టీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అశోక్‌ నేరుగా గ్రౌండ్‌లోకి వెళ్లారు. మణిపూర్‌లో అసలు ఏం జరుగుతోంది? వాస్తవాలేంటి ప్రజలకు కళ్లకు కట్టేందుకు ఎక్స్‌క్లూజివ్‌గా డీటెయిల్స్‌ సేకరిస్తున్నారు.

మణిపూర్‌లోకి ఎంటర్‌ అయిన తర్వాత బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అశోక్‌కు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అక్కడ లోకల్‌గా ఉండే క్యాబ్‌ డ్రైవర్లే గ్రామాల్లోకి వచ్చేందుకు భయంతో వణికిపోయారు. ఇంతకంటే దూరం తాను రాలేనంటూ మార్గమధ్యలో క్యాబ్‌ డ్రైవర్‌ చేతులెత్తేశాడు. కావాలంటే కార్‌ కీస్‌ తీసుకోండి.. సొంతంగా డ్రైవ్‌ చేసుకోండి అంటూ తాళంచెవి ఇచ్చేసి డ్రైవర్‌ వెళ్లిపోయాడు. అలాంటి పరిస్థితుల్లోనూ బిగ్‌ టీవీ వెనకడుగు వేయలేదు. వాస్తవాలను జనం ముందు ఉంచడానికి.. తెలుగు ప్రజలకు మణిపూర్ ఘోష వినిపించడానికి.. ముందడుగే వేసింది. కొన్నిరోజులుగా సాహోసోపేత రిపోర్టింగ్ చేస్తోంది బిగ్ టీవీ. వార్ జోన్ మణిపూర్ నుంచి కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్న బిగ్ టీవీకి..బిగ్ సెల్యూట్.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×