E-Paper
Advertisement

Sajjala: టీడీపీ మసాలాతో సీబీఐ ఛార్జ్‌షీట్.. నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారన్న సజ్జల..

Sajjala: టీడీపీ మసాలాతో సీబీఐ ఛార్జ్‌షీట్.. నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారన్న సజ్జల..
Advertisement
sajjala sunitha

Sajjala: వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌సీట్ సంచలనంగా మారింది. సునీత స్టేట్‌‌మెంట్ వైసీపీలో ప్రకంపణలు సృష్టిస్తోంది. వైఎస్ భారతి, సజ్జల తన ఇంటికి వచ్చారని.. ప్రెస్‌మీట్ పెట్టి ఇష్యూని క్లోజ్ చేయాలని చెప్పారంటూ సునీత వాంగ్మూలం ఇచ్చారు. అవినాశ్‌రెడ్డికి సంబంధం లేదంటూ.. ఆయన పేరు కూడా ప్రెస్‌మీట్లో ప్రస్తావించాలంటూ సజ్జల చెప్పారని సునీత చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది.

సునీత వాంగ్మూలం, సీబీఐ ఛార్జ్‌షీట్‌పై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాను తన భార్యతో కలిసి ఒక్కసారి మాత్రమే సునీత ఇంటికి వెళ్లానని.. భారతితో కలిసి ఒక్కసారి కూడా వెళ్లలేదంటూ చెప్పుకొచ్చారు. సునీత చెప్పిందంతా తప్పేనని అన్నారు. నాలుగేళ్ల తర్వాత కల్పిత కథతో, టీడీపీ మసాలాతో.. సీబీఐ ఛార్జ్‌షీట్‌ వేసిందని ఆరోపించారు.

Advertisement

బేసిక్ లాజిక్ మర్చిపోయి సీబీఐ చెత్త దర్యాప్తు చేసిందని మండిపడ్డారు సజ్జల. వివేకా హత్య వల్ల ఎవరికి నష్టమో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగిందని తప్పుబట్టారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగిందని మండిపడ్డారు సజ్జల. జగన్‌ను డీమోరలైజ్‌ చేసేందుకే ఈ కుట్రలన్నారు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×