E-Paper
Advertisement

ఆదివారం అసెంబ్లీ-సోమవారం మండలి, బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్‌, ఇవాళ సభలో ఏం జరిగింది?

ఆదివారం అసెంబ్లీ-సోమవారం మండలి, బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్‌, ఇవాళ సభలో ఏం జరిగింది?
Advertisement

Telangana Council Session-2026: తెలంగాణ శాసనమండలిలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఆదివారం అసెంబ్లీలో ఏం జరిగిందో.. సోమవారం మండలిలో అదే జరిగింది. బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో వారిపై వేటు వేశారు ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి. సోమవారం మండలిలో ఏం జరిగింది.

మండలిని కుదిపేసిన మంత్రి పొంగులేటి వ్యవహారం

Advertisement

సోమవారం తెలంగాణ శాసనమండలి కాసింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఉదయం సభా సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారాన్ని లేవనెత్తారు. ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ వ్యవహారాన్ని సభలో ప్రస్తావించారు. ఆ సంస్థపై హౌజ్ కమిటీ వేయాలని సభ్యులు డిమాండ్ చేశారు.

అంతేకాదు అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ విషయంలో సభ్యులకు పలుమార్లు ఛైర్మన్ చెప్పారు. సభా సమయాన్ని వృథా చేయడం తగదన్నారు. ఈలోగా బీఆర్ఎస్ సభ్యుల తీరుపై శాసనసభాపక్ష వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు.

Advertisement

బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన..  ఒకరోజు సభ్యులను సస్పెండ్‌ చేసిన ఛైర్మన్

ఛైర్మన్ అప్పీల్ చేసినా వినకుండా సభకు అడ్డుతగలడం సరికాదన్నారు. ప్రతిపక్షం ఉద్దేశపూర్వక గందరగోళం సృష్టిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సోమవారం రోజంతా సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. సస్పెండ్ తర్వాత సభ్యులను మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించి వేశారు. ఆ తర్వాత సభను కొద్దిసేపు వాయిదా పడింది.

బయటకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై వస్తున్న ఆరోపణల విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని పలువురు సభ్యులు ప్రశ్నించారు. నైతిక బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ పోరాటం ఆగదన్నారు. సభ లోపల బయట కూడా నిరసనను కంటిన్యూ చేస్తామని తేల్చిచెప్పారు. తెలంగాణ చరిత్రలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి.

ALSO READ: ప్రజా భవన్ లో ‘వార్ రూమ్’.. పుష్కరాల విషయంలో రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!

 

 

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×