BigTV English
Advertisement

Chicken Rate: చికెన్ @400.. కోడి కొనేటట్టులేదు..

Chicken Rate: చికెన్ @400.. కోడి కొనేటట్టులేదు..
chicken rate

Chicken Rate: సండే ఆర్ మండే.. ఏ రోజైనా చికెన్ తినాల్సిందే. వద్దనే వాళ్లు తక్కువే. మటన్ రేట్ చాలా ఎక్కువ కావడంతో.. చాలామంది చికెనే ప్రిఫర్ చేస్తుంటారు. కోడి కూర అయితే మెత్తగా, టేస్టీగా గొంతులోకి జారిపోతుంటుంది. లెగ్‌పీస్ పట్టుకుని కొరుక్కుతుంటుంటే.. నా సామిరంగా.. స్వర్గం ముందు నిలుచున్నట్టు అనిపిస్తుంది. ఇక చికెన్ బిర్యానీకైతే తిరుగుండదు. కోడితో కూరొండినా, ఫ్రై చేసినా.. దేనికదే సాటి. ఇక మందుబాబులైతే మంచింగ్‌కు చికెన్ పీసెస్ ఉండాల్సిందే. తందూరీలు, కబాబ్స్, 65లు, చిల్లీ చికెన్, బటర్ చికెన్.. ఇలా రకరకాల పేర్లతో.. చికెన్‌ను లాగించడమే పని. తాగుడుకంటే తినుడు బ్యాచే ఎక్కువ ఉంటారు. అందుకే, చికెన్‌కు అంతటి డిమాండ్.


అలాంటి చికెన్ ధర ఇప్పుడు కొండెక్కింది. రెండువారాల్లోనే ఏకంగా వందకు పైగా ధర పెరిగింది. స్కిన్‌లెస్‌ చికెన్‌ ఏకంగా కేజీ సుమారు 400కి చేరింది. రెండు వారాల క్రితం స్కిన్ లెస్ చికెన్ కిలోకి 240 నుంచి 260 మధ్యలో ఉండగా.. లైవ్ కోడి రూ.140 నుంచి 160 మధ్య ఉండేది. పెరిగిన ధరలతో సామాన్యుడు షాక్ అవుతున్నాడు. అర కిలో తినేవాళ్లు.. పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. దీంతో చికెన్ అమ్మకాలు కూడా 40 శాతం వరకు పడిపోయినట్టు తెలుస్తోంది.

పెరిగిన ఎండలతో కోళ్లు చనిపోతున్నాయని, కోళ్ల కొరత ఏర్పడటంతో ధరలు పెరిగాయని చెపుతున్నారు వ్యాపారులు. ఇన్నాళ్లూ పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో డిమాండ్ పెరిగిందని అంటున్నారు. వర్షాలు పూర్తి స్థాయిలో పడితేగానీ చికెన్ ధర సాధారణ స్థాయికి చేరుకోకపోవచ్చు.


Related News

Amaravati News: ప్రమాదకరంగా ‘బ్లూ బ్యాచ్’.. మంత్రి లోకేష్ సూచన, రంగంలోకి పోలీసులు?

Amaravati News: న్యూఇయర్‌కి ముందే.. కూటమి ప్రభుత్వం కొత్త ప్లానేంటి?

West Godavari: పశ్చిమ టీడీపీ పగ్గాలు ఎవరికో?

Dharmana prasada : కొడుకు ఎంట్రీ.. రాజకీయాలకు ధర్మాన గుడ్ బై..!

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. తప్పు ఎవరిది? అసలు ఏం జరిగింది?

AP Heavy Rains: ఏపీకి మొంథా తుపాను ముప్పు.. బాంబ్ పేల్చిన వాతావ‌ర‌ణ శాఖ‌

Kesineni Vs Kolikapudi: కొలికపూడి కేశినేని మధ్య వార్.. చంద్రబాబు నిర్ణయం ఇదే?

Tdp Tweet: కోడి కత్తి.. కమల్ హాసన్.. టీడీపీ ర్యాగింగ్!

Big Stories

×