E-Paper
Advertisement

CM Revanth Diwali Wishes : పదేళ్ల చీకట్లను తరిమేశాం.. ప్రజలకు సీఎం దీపావళీ శుభాకాంక్షలు

CM Revanth Diwali Wishes : పదేళ్ల చీకట్లను తరిమేశాం.. ప్రజలకు సీఎం దీపావళీ శుభాకాంక్షలు
Advertisement

CM Revanth Diwali Wishes : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళిని రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని కోరుకున్నారు. దీపాల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి.. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో దీపావళిని నిర్వహించుకోవాలని సూచించారు. చిన్నా, పెద్దా అంతా పండుగలో సంతోషంగా పాల్గొవాలని కోరిన ముఖ్యమంత్రి.. ఇటీవల జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, ప్రమాదాలకు తావు లేకుండా దీపాల పండుగను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే.. గత ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శాత్మకంగా వ్యాఖ్యాలు చేశారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం చోటుచేసుకుందన్న రేవంత్.. దాని తాలుకు చీకట్లు తొలిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అందరి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. తమ పరిపాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని ధీమా వ్యక్తం చేశారు.

Related News

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

Big Stories

Advertisement
×