E-Paper
Advertisement

KA Movie OTT : భారీ ధరకు ‘క ‘ ఓటీటీ డీల్.. ఒకేసారి రెండిట్లో స్ట్రీమింగ్..

KA Movie OTT :  భారీ ధరకు ‘క ‘ ఓటీటీ డీల్.. ఒకేసారి రెండిట్లో స్ట్రీమింగ్..
Advertisement

KA Movie OTT : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బరం ప్రస్తుతం క మూవీ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు.. ఈ మూవీ పై భారీ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పీరియాడికల్ డ్రామా రూపొందిన ఈ మూవీ రేపు దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలకానుంది.. ఈ మూవీ తో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ సినిమాలతో పాటు ‘క’ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ సినిమా పై కిరణ్ అబ్బవరం ఆశలు పెట్టుకున్నాడు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థలు దక్కించుకున్నాయని తెలుస్తుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ హీరో కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘క’ సినిమా కు సంబంధించి ఓటీటీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఫ్యాన్స్ అమౌంట్ చెల్లించినట్లు తెలుస్తోంది.. అలాగే మరో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ రెండు నిర్మాణ సంస్థలు తమ సినిమాలను పలు ఓటీటీ సంస్థలకు అమ్ముతున్నాయి. రీసెంట్ గా సుధీర్ బాబు హీరోగా నటించిన ‘హరోమ్ హర’ సినిమాను మేకర్స్ మూడు ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ కు అమ్మారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ తో పాటు సన్ నెక్ట్స్ లోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement

ఇక ఈ సినిమా లో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తుండగా నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుజీత్, సందీప్ జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఈ మూవీని దేశ వ్యాప్తంగా దీపావళి కానుకగా ఈ నెల 31 న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో కిరణ్ పోస్టుమ్యాన్ పాత్రలో కనిపిస్తున్నారు. తనకంటూ ఓ ఫ్యామిలీ లేని కిరణ్, ఊరి వాళ్లకు వచ్చిన లెటర్స్ ను చదువుతూ ఎంజాయ్ చేసేవాడు. అనుకోకుండా ఆ ఊరికి పెద్ద ఆపద వస్తుంది. దాని నుంచి ఊరిని ఎలా కాపాడాతారు అనేది సినిమా స్టోరీ.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. హీరో లుక్ కూడా కొత్తగా ఉందనే టాక్ ను సొంతం చేసుకుంది ..  ఈ మూవీ హిట్ అవ్వక పోతే సినిమాలు మానేస్తానని హీరో చెప్పిన విషయం తెలిసిందే. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×