E-Paper
Advertisement

Cm Revanth Reddy: ఈ నెల 8న యాదాద్రికి సీఎం రేవంత్…వీటిపై స‌మీక్ష‌!

Cm Revanth Reddy: ఈ నెల 8న యాదాద్రికి సీఎం రేవంత్…వీటిపై స‌మీక్ష‌!
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీన యాదాద్రికి వెళ్ల‌నున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఇప్ప‌టికే ఓసారి యాద్రాద్రిలో ప‌ర్య‌టించ‌గా ఇది రెండోసారి. సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ప్ర‌భుత్వ విప్ బీర్ల ఐల‌య్య క‌లెక్ట‌ర్ తో క‌లిసి గుట్ట కింద ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని ప‌రిశీలించారు. 8వ తేదీ ఉద‌యం యాదాద్రిలో స్వామివారిని ద‌ర్శించుకోబుతున్న‌ట్టు స‌మాచారం. అనంత‌రం పెండింగ్ లో ఉన్న ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను ఆయ‌న ప‌రిశీలించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

Also read: ‘జగన్నా’టకం.. స్కెచ్ మామూలుగా లేదుగా?

Advertisement

అదేవిధంగా ప్రధాన ఆల‌య విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం ప‌నుల‌పై ఆయ‌న స‌మీక్ష చేయ‌బోతున్నార‌ట‌. దీంతో ఆల‌య అభివృద్ధిపైనా కీలక నిర్ణ‌యాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి యాదాద్రికి వ‌స్తుండ‌టంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. కార్తీక‌మాసం కావ‌డంతో భ‌క్తుల ర‌ద్దీ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి సీఎం ప‌ర్య‌ట‌న‌కు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మొద‌టిసారి సీఎం కుటుంబ స‌మేతంగా స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను ప్రారంభించారు.

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×