BigTV English

Intinti Ramayanam Today Episode : అవనికి సపోర్ట్ గా పార్వతి.. పల్లవికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అవని..

Intinti Ramayanam Today Episode : అవనికి సపోర్ట్ గా పార్వతి.. పల్లవికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అవని..

Intinti Ramayanam Today Episode November 4th : గతవారం ఎపిసోడ్ లో .. గదిలోకి వెళ్లిన అక్షయ్ లైట్ ఆఫ్ చేసి ఉండటం చూసి ఎందుకు రూమ్ లో లైట్ ఆఫ్ చేశావని అడుగుతాడు. అప్పుడు ఎదురుగా అవని రొమాంటిక్ గా రెడీ కనిపిస్తుంది. కానీ అక్షయ్ చూడడు. ఇక దగ్గరకు రావడంతో అవనిని అలా చూసి షాక్ అయిన అక్షయ్ తో అవని నన్ను దూరం పెడతావా అని బాధ పడుతుంది. ఇక నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు.. మొత్తానికి అక్షయ్ మాత్రం అవని నిజం చెప్పేవరకు దగ్గరకు రానివ్వను అని వెళ్ళిపోతాడు. గాయం తగలడంతో హాస్పిటల్ కు వెళ్తాడు. అక్కడ మీనాక్షిని చూసి అసలు నిజం చెప్పాలని, ఆస్తి కోసం వస్తే ఇక నిన్ను, నీ పిల్లలను చంపేస్తాను అని చెబుతాడు.. ఇక మీనాక్షి భయపడుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. అవనికి తమ్ముడు ఫోన్ చేసి చెబుతాడు. అమ్మకు సీరియస్ అని చెబుతాడు. అవని వెళ్లడం అక్షయ్ చూస్తాడు. దానికి కోపంగా ఉంటాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక ఇంట్లో అందరు దీపావళి పూజకు సిద్ధం చేస్తారు. ఇక అవని పూజకు ఏర్పాటు చేస్తుంది. ఇక ఉదయం అవని అందరు రెడీ దీపావళి పూజలు చేస్తారు. ఇక పూజ పూర్తి అయ్యే సమయానికి కమల్ అక్కడకు వస్తాడు. కాఫీ కావాలి అని అరుస్తాడు. కాఫీ అని అడగటంతో అందరికీ హారతి మీరు ఇవ్వండి అత్తయ్య నేను వెళ్లి కమల్ కి కాఫీ ఇస్తానని అవని వెళ్తుంది. పండగ పూట కూడా ఏంటి కన్నయ్య అని అవని అడుగుతుంది. నాకు కాఫీ కావాలి వదిన అని కమల్ అడుగుతాడు. ఈరోజు పండగ నువ్వు వెళ్లి బ్రష్ చేసి స్నానం చేసి రా అప్పుడే నీకు కాఫీ అని అంటుంది. మామయ్య వస్తే అరుస్తాడు వెళ్ళు అనేసి అంతలోకే రాజేంద్రప్రసాద్ అక్కడికి వస్తాడు. పండగ పూట కూడా ఇలా బాధ్యత లేకుండా రాజేంద్రప్రసాద్. అప్పుడు కమల్ అందరూ తిడుతుంటే నవ్వుతాడు. ఎందుకురా తిడుతుంటే నవ్వుతున్నావ్ అని అడుగుతారు. నన్నే తిడుతున్నారు ఇంకా పల్లవి నిద్రపోతుంది మరి పల్లవిని ఎలా తిడతారు అనేసి నవ్వుతున్నా అని అంటాడు. అప్పుడే పల్లవి బయటకు వస్తుంది. జూలో జంతువులు చూసినట్టు చూస్తున్నారు ఏమైంది అనేసి అడుగుతుంది. పండగ పూట కూడా ఇంతగా పడుకుంటారా కొంచెం తొందరగా లేవాలి అని తెలియదా అనేసి పార్వతి అడుగుతుంది. అలాగే బామ్మా కూడా ఏంటమ్మా ఇంత ఆలస్యంగా లేచావు అని అడుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడగడంతో పల్లవి నేను ఆలస్యంగా లేవడానికి కమల్ బావే కారణమని చెబుతుంది.. బావ పెట్టే గురకవల్లే నాకు నైట్ నిద్ర పట్టడం లేదు అందుకే ఉదయం ఆలస్యం అవుతుందని చెప్తుంది. అక్షయ్ కమల్కు మెడిసిన్స్ వాడమని సలహా ఇస్తాడు. ఇక అవని డాక్టర్ని కలువు ఆ కన్నయ్యని సలహా ఇస్తుంది.

అక్షయ్ లాప్టాప్ లో పని చేసుకుంటూ ఉంటాడు. అవని కాఫీ తీసుకొని వస్తుంది. నాకు వద్దు అని అంటాడు. సరే టిఫిన్ చేసి కాఫీ తాగండి అని అవని అంటుంది. నాకొద్దు నువ్వు చెప్పే నిజాలు కొందరికి బాధను కలిగిస్తున్నాయని అక్షయ్ అంటాడు. కాసేపు ఇద్దరు మధ్య వాదన వినిపిస్తుంది . అక్షయ్ అవని మీద అనుమానంతో కోపంతో మాట్లాడుతాడు. అవని తిండి మీద కోపం చూపించండి అనేసి పెడుతుంది. పక్కనే గ్లాస్ లో ఉన్న వాటర్ లాప్టాప్ మీద పడతాయి. కొంచెం కూడా నీకు బుద్ధి లేదా ఇలా చేస్తావా నీకు చెప్తే అర్థం కాదా? ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా నీకు ఉండదా? ఎందుకు ఎవరేమనుకొని బరితెగించావా అనేసి నానా మాటలు అనేస్తాడు. అవని పై అరవడం చూసి అందరూ అక్కడికి వస్తారు. ఏమైందని అడిగితే లాప్టాప్ మీద వాటర్ వేసింది . అనేసి అంటాడు. లాప్టాప్ ఏమైనా పడిందా అని పార్వతి అడుగుతుంది. లేదు అంటాడు. మరి లేనప్పుడు ఎందుకు అవన్నీ తిడుతున్నావ్ అసలు నీకు ఏమైంది అనేసి అడుగుతుంది. అవనిని వాడు కోపంగా ఉన్నాడమ్మా నువ్వు లోపలికి వెళ్ళనేసి పార్వతి లోపలికి పంపిస్తుంది.


కిచెన్ లోకి వెళ్లిన అవని ఏడుస్తూ ఉంటుంది. వెనకాలే పార్వతీ వచ్చి వాడు ఏదో కోపంగా ఉన్నాడు అందుకే అన్నాడు నువ్వు పట్టించుకోకు కాసేపు ఆగితే వాడే నీకోసం వెంపర్లాడతాడని చెబుతుంది,. అవని చూసి పల్లవి మురిసిపోతుంది. అవన్నీ ఇలా ఏడుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి సంబరపడిపోతుంది. పార్వతీ వెళ్లగానే అవని దగ్గరికి పల్లవిస్తుంది. శ్రీకర్ బావను నాకు దూరం చేసి శ్రియతో పెళ్లి చేశావు. శ్రీకర్ బావని నాకు దూరం చేసి శ్రియతో పెళ్లి చేయించావునా బాధ ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించావని అవనికి కౌంటర్ లేస్తుంది పల్లవి . ఇద్దరి మధ్య వాదన వినిపిస్తుంది. చివరికి నన్ను ఏడిపించాలని నాతో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నావ్ నేను అంత సులువుగా ఓడిపోతానని అనుకోవద్దు పల్లవి అని అవని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. పల్లవికి వాంతులు వచ్చేలా ఉండడంతో పల్లవి వెళ్ళిపోతుంది . ఇక కమల్ గేమ్ ఆడుకుంటూ కనిపిస్తాడు అప్పుడు బామ్మ అక్కడికి వచ్చి పెళ్ళాంతో సరదాగా షికారుకి వెళ్ళడం షాపింగ్ కి వెళ్ళడం కాపురం చేయడం లాంటివి లేవు ఇలా గేమ్స్ ఆడితే పిల్లలు ఎలా పుడతారు అనేసి అడుగుతుంది. గేమ్ ఆడడం అంత ఈజీ అనుకుంటున్నావు అని కమల్ భామకు గేమ్ నేర్పిస్తాడు. గేమ్లో బామ్మ ఓడిపోతుంది. కమల్ ఫోను విసిరి కొడుతుంది. గేమ్ ఓడిపోయాను నాకు బీపీ పెరుగుతుంది వెళ్లి మాత్రం వేసుకోవాలని లోపలికి వెళ్తుంది. కమల్ ఫోన్ పని చేయకపోవడంతో లోపలికి వెళ్లి ఛార్జింగ్ పెట్టాలని అనుకుంటాడు చార్జింగ్ ఎక్కట్లేదు ఫోన్ పగలగొట్టేసింది అనేసి ఫీల్ అవుతాడు. పల్లవి వాంతులు చేసుకోవడం చూసి పల్లవి ప్రెగ్నెంట్ అని గంతులు వేస్తాడు దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. పల్లవికి వాంతులు ఎందుకు అవుతున్నాయని టెస్ట్ చేసుకోవాలని టెస్ట్ చేసుకుంటుంది. అందులో పాజిటివ్ వస్తుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×