E-Paper
Advertisement

Addanki Counter: వేడెక్కిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్ వ్యాఖ్యలు, అసలు గుట్టు బయటపెట్టిన అద్దంకి

Addanki Counter: వేడెక్కిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్ వ్యాఖ్యలు, అసలు గుట్టు బయటపెట్టిన అద్దంకి
Advertisement

Addanki Counter: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జోరందుకున్న వేళ తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మీడియా ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్.

ఫోన్ ట్యాపింగ్ కేసు వేళ వేడెక్కిన మాటల యుద్ధం

Advertisement

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ పరమ పవిత్రుడుగా మాట్లాడుతున్నారని, కవిత ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుపుతోందని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధించలేదన్నారు. తెలంగాణ‌లో కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన జరగదని కుండబద్దలు కొట్టేశారు.

శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన అద్దంకి దయాకర్, పనిలో పనిగా బొగ్గు టెండర్లపై నోరు విప్పారు. ప్రతిమ శ్రీనివాసరావు ఎవరు? సృజన్ రెడ్డి ఎవరు మీకు తెలీదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. కోల్ బ్లాక్ టెండర్లు నాలుగు బీఆర్ఎస్‌‌కు రాలేదా? టెండర్లు మీకు వస్తే కాంగ్రెస్ అవినీతి చేస్తుందా? అసలు అవినీతి అక్రమాలకు కేరాఫ్ కేసీఆర్ కుటుంబమని తేల్చేశారు.

Advertisement

కేటీఆర్ వ్యాఖ్యలపై అద్దంకి ఆగ్రహం

రాబందుల మాదిరిగతా తెలంగాణను దోచుకున్నదెవరు? మీరు అవినీతి చేయలేదని నిరూపిస్తారా? తాము నిరూపిస్తామని, మీరు సిద్దమేనా? అనైతిక, ఆక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ-కేసీఆర్ కుటుంబం కేరాఫ్ అడ్రస్‌గా ఆయన వర్ణిచారు. తెలంగాణకు మీర జమిలి దొంగలని, దోచుకున్నారని ఘాటుగా విమర్శించారు. పార్టీ ఫండ్ కోసం ఎవర్ని బెదిరించారో తెలీదా? మీ పార్టీ ఫండ్ రూ. 800 కోట్లు ఎలా అయ్యింది? నికర ఆస్తుల విలువ ఈసీ‌కి ఇచ్చిన అఫిడవిట్‌లో చెక్ చేసుకోవాలన్నారు.

ఉద్యమాలు అందరూ చేస్తే దాన్ని క్రెడిట్ తీసుకోలేదా? ప్రభుత్వంలో మీరే ఉండాలా? అసలు మీ మీద ఎందుకు అవినీతి ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఆనాటి హోంమంత్రి అలీ మీద ఎందుకు రావడం లేదన్నారు.ముఖ్యమంత్రి-మంత్రులు కలిసి ఉన్న తీరుని చూసి కాళకేయల మాదిరిగా మీరు చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ నమ్మరని తేల్చేశారు.

ఏం సాధించాలని ఫోన్లు ట్యాపింగ్ చేశారని నిలదీశారు. ఈ కేసులో అధికారులు మీ పేర్లు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ఎంతో కష్టపడి పైకొచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా చేయలేదా అంటూ ప్రశ్నలు లేవనెత్తారు.

ALSO READ: మీడియాతో కేటీఆర్.. తప్పుడు పనులు చేయలేదు, రెండేళ్లుగా నా పరువుకు బాధ్యులెవరు?

 

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×